SOS Boxes: Did you know that these boxes found on the road can save lives?
SOS Boxes: రోడ్డుపై కనిపించే ఈ బాక్స్ లు ప్రాణాలు కాపాడుతాయని తెలుసా?
SOS Boxes: రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కారు లేదా బైక్ ప్రమాదం జరిగినప్పుడు అచేతన స్థితిలో ఉండాల్సి వస్తుంది.
మరికొన్ని సందర్భాల్లో కారు పాడైపోతుంది. ఆ సమయంలో ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. కనీసం కనుచూపు మేర కూడా మనుషులు కనిపించరు. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ బాక్సులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
రోడ్డుమీద లేదా రైలు ప్రయాణించే మార్గంలో కొన్ని బాక్సులు కనిపిస్తూ ఉంటాయి. వీటిని చాలా మంది చూస్తారు. కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ బాక్సులు ప్రాణాలు కాపాడుతాయంటే ఎవరూ నమ్మరు. అయితే బాక్సులను చాలా మంది చూసినా వాటిపై అవగాహన లేకపోవడంతో వాటిని ఉపయోగించుకోరు. కొన్ని బాక్సులపై SOS అని రాసి ఉంటుంది. Save Our Soul అని దీని అర్థం. దీనిని సరైన విధంగా వీటిని వాడుకుంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవి. ఇంతకీ ఈ బాక్సుల పనితీరు ఎలా ఉంటుందంటే.
ఉదాహరణకు రోడ్డుమీద వెళ్లేటప్పడు ప్రమాదం జరిగిందనుకుందాం…వాహనం పూర్తిగా డ్యామేజ్ అయి.. కనీసం ఫోన్ కూడా పనిచేయని సందర్భంలో చాలా మందికి ఏం తోచదు. ఇలాంటి సమయంలో రోడ్డు పక్కన ఉండే బాక్స్ దగ్గరకు వెళ్లొచ్చు. ఇక్కడ ఉన్న ఎమర్జెన్సీ బాక్స్ పై ఉన్న మధ్యలో బటన్ నొక్కి వాయిస్ మెసేజ్ పంపించవచ్చు. ఈ మెసేజ్ సమీపంలోని పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, అంబులెన్స్ కు ఒకేసారి వెళ్తుంది. ఈ సమాచారం ఆధారంగా వారు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి ప్రాణాలు కాపాడుతారు.
అలాగే ప్రయాణ సమయంలో కారు పాడైపోయినా.. లేదా డ్రైవింగ్ లో ఎటువంటి ఇబ్బందులు పడినా ఈ బాక్సును ఉపయోగించుకోవచ్చు. అయితే కారు పాడైపోయిన ప్రదేశంలో ఈ బాక్స్ లేదు. అలాంటప్పుడు మొబైల్ నుంచి 1033 కి డయల్ చేయాలి. ఇలా కాల్ చేయగానే సంబంధిత మెకానిక్ చేసేవాళ్లు అక్కడికి చేరుకుంటారు. దూర ప్రయాణాలు చేసేవారికి ఇది ఎందో ఉపయోగకరంగా ఉంటుంది.
COMMENTS