Ration Cards | Rice: Increased rice prices.. Number of ration card applications pouring in..
Ration Cards | Rice:పెరిగిన బియ్యం ధరలు.. పోటెత్తుతున్న రేషన్ కార్డు దరఖాస్తుల సంఖ్య..
రోజురోజుకూ నిత్యావసర ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. ఇప్పటికే వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం కూడా వచ్చి చేరాయి. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి.
HMT, BPT, సోనామసూరి ధరలు క్వింటాల్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగాయి. గతంలో క్వింటాలుకు రూ. 3,300 నుంచి రూ. 3,500 వరకు ఉండగా ఇప్పుడది రూ. 4,500కు చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
దీంతో ఆయా రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. వరదలతో పంటనష్టం, వరిసాగు తగ్గడమే బియ్యం రేట్లు పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా నిత్యావసరాల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి
దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఖరీఫ్ లో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. దీని కారణంగానే నిత్యావసర ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
ఇక.. నిన్నమొన్నటి వరకు కిలో బియ్యం రూ. 45 నుంచి రూ.50 మధ్య లభించగా ఇప్పుడా ధర ఏకంగా రూ. 60కి పెరిగింది. గత ఏడాది జనవరిలో కర్ణాటక పొన్ని బియ్యం కిలో రూ.46 విక్రయం కాగా, చిల్లర విక్రయాల్లో రూ.55 నుంచి రూ.60వరకు ధర నిర్ణయించారు.
అలాగే, మనచ్చి నల్లూర్ పొన్ని కిలో రూ.65, సాధారణ బియ్యం రూ.40 నుంచి రూ.51సహా అన్నిరకాల బియ్యంధరలు పెరిగాయి. మొత్తానికి 20 శాతం మేర బియ్యం ధరలు పెరిగాయి.
ప్రస్తుతం క్వింటాల్ బియ్యం రూ.4500 నుంచి రూ.5000 ఉండగా.. ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ధర రూ.6,500కు చేరింది. పాత బియ్యం అయితే రూ.7500 వరకూ పలుకుతోంది. మొత్తంగా సగటున క్వింటాల్‌పై రూ.1000 వరకు పెరిగింది.
ఇదిలా ఉండగా.. బియ్యం కొనలేని బీపీఎల్ కుటుంబాలు చాలా వరకు ప్రభుత్వం అందించే ఉచిత బియ్యంపై ఆధారపడుతుంటాయి. ఇప్పటికీ చాలా మందికి తెలంగాణలో రేషన్ కార్డులు లేవు. కొత్త రేషన్ కార్డుల కొరకు చాలా మంది దరఖాస్తులను సమర్పిస్తున్నారు.
ఇప్పుడు బయట కొనే బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. బీపీఎల్ కుటుంబాలకు చెంది.. రేషన్ కార్డు లేని వాళ్లు లబోదిబోమంటున్నారు. త్వరగా తమకు రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతున్నారు. అంతే కాకుండా.. బియ్యం ధరలు నిత్యం పెరుగుతుండటంతో.. వాటిని అదుపులో ఉంచే చర్యలు ప్రభుత్వం చేపట్టాల్సిందిగా వేడుకుంటున్నారు.
COMMENTS