PPF Account : Open a PPF account in your child's name and get Rs 32 lakhs.
PPF Account : మీ పిల్లల పేరుపై పీపీఎఫ్ అకౌంట్ తెరవండి .రూ .32 లక్షలు పొందండి.
PPF Account For Minors: ప్రస్తుతం ఆదాయం పెంచుకునేందుకు అనేకమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చు. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో కూడా అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
పిల్లల జీవితం అద్బుతంగా ఉండాలని, విద్య, పెళ్లిళ్ల టెన్షన్ నుంచి గట్టెక్కాలంటే తల్లిదండ్రులు ఎన్నో చర్యలు తీసుకుంటారు. అలాంటి సమయంలో పిల్లల పేరుపై పెట్టబడి పెట్టి మంచి రాబడిని అందుకోవచ్చు. అలాంటి పథకాలలో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). ఆర్థిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
సరైన సమయంలో మీ పిల్లల పేరుపై పీపీఎఫ్ అకౌంట్‌ను తెరిచి కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ప్తి నెలా కొంత డబ్బును పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయడం మొదలు పెట్టండి. ఇందు కోసం ఎలాంటి పత్రాలు అవసరమో తెలుసుకోండి. అసలు పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాలంటే వయసుతో సంబంధం లేదు. ఇందు కోసం ఏదైనా అధీకృత బ్యాంకుకు వెళ్లి అక్కడ ఫారం నింపడం ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయడం వల్ల ఖాతా నుంచి ఏకంగా రూ.32 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చేసరికి పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అవుతంఉది. తర్వాత మీరు కావాలనుకుంటే కాల వ్యవధిని పెంచుకునే సౌకర్యం ఉంటుంది. ఉదాహరణకు.. మీ మైనర్ పిల్లల వయసు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు పీపీఎఫ్ ఖాతా తెరిచారనుకుందాం.. మీరు పిల్లల పీపీఎఫ్ ఖాతాలో ప్రతి నెల రూ.10,000 డిపాజిట్ చేయడం ప్రారంభించాలి. ఇలా 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తూనే ఉండాలి. మీ డబ్బుపై 7.10 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ ఖాతా మెచ్యూరిటీపై రూ. 3,216,241 లభిస్తుంది. మీ బిడ్డకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాతే మొత్తం డబ్బులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే మీరు
PPF ఖాతాను ఎలా ఓపెన్ చేయాలి.?
పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతా తెరవడానికి మీరు మీ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్ వివరాలను చిరునామా రుజువుగా ఇవ్వవచ్చు. మీరు మీ మైనర్ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి. ఖాతా తెరిచే సమయంలో మీరు కనీసం రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చెక్కును అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పిల్లల పేరు మీద PPF పాస్‌బుక్ జారీ చేస్తారు.
COMMENTS