Kadamba Tree: .. the specialty of Kadamba which is the favorite tree of Gods is..!
Kadamba Tree: రాధాకృష్ణుల ప్రేమకు సాక్ష్యంగా.. దేవతలకు ఇష్టమైన వృక్షంగా నిలిచిన కదంబ విశిష్టత ఏమిటంటే..!
Kadamba Tree:హైందవ సంస్కృతిలో కదంబ వృక్షానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు. ఇక హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం. అంతేకాదు కృష్ణుడు .. గోపికల చీరలను దాచింది ఈ చెట్టుపైనే.. ఇక ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ రాధాకృష్ణుల ప్రేమాయణం కొనసాగిందని, అందుకే అంతటి విశిష్టతను సొంతం చేసుకుంది ఈ కదంబ వృక్షం. . భగవద్గీత, మహాభారతంలో కూడా ఈ మొక్క గురించి ప్రస్తావన వుంది.
*కదంబ వృక్షం చాలా పెద్దది. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు.
*పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికివస్తుంది. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది.
* ఈ వృక్షం ఇది ఆకురాల్చదు. ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు నుంచి అత్తర్లు తయారు చేస్తుంటారు.
పురాణాల్లో కదంబ వృక్షం ప్రస్తావన :
ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతం లో పార్వతీవృక్షమనీ అంటారు.
* ఈ వృక్షానికి కృష్ణుడికీ మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి
* దక్షిణాదిలో అమ్మవారిని కదంబవనవాసిని అంటారు. కదంబ వృక్షానికి ఓం శక్తిరూపిణ్యై నమః అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు
* గ్రహదోషాలు తొలగించు కోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి
* హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం.. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం.
*దక్షిణాదిలో అమ్మవారిని కదంబవనవాసిని.. అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు నారాయణా నారాయణి లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.
COMMENTS