Educational Epiphany - State Level Merit Test 2024 – Full Details Here
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ - రాష్ట్ర స్థాయి మెరిట్ టెస్ట్ 2024 – పూర్తి వివరాలు ఇవే
7, 10 తరగతుల విద్యార్థులకు మెరిట్ టెస్ట్:
ఎడ్యుకేషనల్ ‘ఎపిఫని' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్ 2024 పరీక్షల షెడ్యూల్, రిజిస్ట్రేషన్ లింక్, క్యూఆర్ కోడ్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనరు సురేష్ కుమార్ విడుదల చేశారు. మంగళవారం (డిసెంబర్ 26) సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో 'ఎడ్యుకేషనల్ ఎపిఫని' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తవనం వెంకటరావు, ఉపాధ్యక్షులు హేమచంద్ర.. కమిషనరుతో భేటీ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు డిసెంబరు 27 నుంచి జనవరి 8 వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.
సిలబస్:
డిసెంబరు నెలాఖరు వరకు ఉన్న సిలబస్ నుంచి 80 శాతం ప్రశ్నలు ఉంటాయని, మిగిలిన 20 శాతం జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ ఉంటాయని, జనవరి 23న ప్రిలిమనరీ, జనవరి 31న మెయిన్స్, ఆన్లైన్లో 'కోడ్ తంత్ర' సాఫ్ట్వేర్ పరీక్షలు ఉంటాయని తెలిపారు.
బహుమతులు వివరాలు:
ఈ పోటీల్లో మొత్తం 162 మంది విజేతలకు దాదాపు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. మరో 1,752 మందికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ప్రకటించారు. ఏడో తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు రూ.20 వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్లో గాని, 96667 47996 నంబర్ లో సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు, ఉపాధ్యక్షుడు హేమచంద్ర, కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 27/12/2023
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 08/01/2024
ప్రిలిమనరీ పరీక్ష తేదీ: 23/01/2024
మెయిన్స్ పరీక్ష తేదీ: 31/01/2024
Important Links:
FOR REGISTRATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
.................................................
🔥 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram Channel ->https://bit.ly/3S6XNo4
COMMENTS