Degree Lecturer & Junior Lecturer Posts in TTD Colleges – Salary: Rs.57,100 - Rs.1,51,370 per month
తితిదేకు చెందిన కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ & జూనియర్ లెక్చరర్ పోస్టులు – వేతనం: నెలకు రూ.57,100 - రూ.1,51,370
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం లో నడిచే వివిధ డిగ్రీ కళాశాలలు / ఓరియంటల్ కాలేజీల్లో 49 లెక్చరర్లు పోస్టులు; తితిదే జూనియర్ కాలేజీల్లో 29 జూనియర్ లెక్చరర్ల తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తితిదేకు చెందిన వివిధ డిగ్రీ కళాశాలలు / ఓరియంటల్ కాలేజీల్లో 49 లెక్చరర్లు పోస్టులు; తితిదే జూనియర్ కాలేజీల్లో 29 జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన నియమించనున్నట్లు తెలిపింది. మొత్తంగా 78 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి తొలి వారం నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
వయో పరిమితి: జులై 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఇచ్చారు.
మొత్తం ఖాళీలు: 78
డిగ్రీ లెక్చరర్ పోస్టులు: 49 ఖాళీలు
అకడెమిక్ రికార్డుతో పాటు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు నెట్/స్లెట్ అర్హత తప్పనిసరి.
సబ్జెక్టుల వారీ ఖాళీలు
బోటనీ- 3, కెమిస్ట్రీ- 2, కామర్స్- 9, డెయిరీ సైన్స్- 1, ఎలక్ట్రానిక్స్- 1, ఇంగ్లిష్- 8, హిందీ- 2, హిస్టరీ- 1, హోమ్ సైన్స్- 4, ఫిజికల్ ఎడ్యుకేషన్- 2, ఫిజిక్స్- 2, పాపులేషన్ స్టడీస్- 1, సంస్కృతం- 1, సంస్కృత వ్యాకరణం- 1, స్టాటిస్టిక్స్- 4, తెలుగు- 3, జువాలజీ- 4 పోస్టుల చొప్పున ఉన్నాయి.
జూనియర్ లెక్చరర్: 29 ఖాళీలు
మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఈ పోస్టులకు సబ్జెక్టుల వారీ ఖాళీలను పరిశీలిస్తే.. బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్- 4, కామర్స్- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకైతే రూ.370.
వేతనం: డిగ్రీ లెక్చరర్లకు రూ.61,960 - రూ.1,51,370; జూనియర్ లెక్చరర్లకు రూ.57,100 - రూ.1,47,760 చొప్పున నెల వారీ వేతనం అందజేస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఫిబ్రవరి తొలి వారం నుంచి
దరఖాస్తుల చివరి తేదీ: 29/02/2024 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
.................................................
🔥 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram Channel ->https://bit.ly/3S6XNo4
COMMENTS