Court ordered doctors to write prescriptions in understandable language.
అర్థమయ్యే భాషలో ప్రిస్క్రిప్షన్ రాయాలని వైద్యులను ఆదేశించిన కోర్టు.
వైద్యులు ప్రిస్క్రిప్షన్లు రాసిన డాక్టర్‌కు, ఆ మందుల షాపు వాడికి తప్ప మనకు అస్సలు అర్థంకావు. ఎవర్ని అయినా అర్థంచేసుకోవచ్చేమో కానీ.. ఆ మందుల సీటిలో ఏం రాశామో అని మాత్రం మనం అర్థం చేసుకోలేం.. చిన్నప్పటి నుంచి వీటిపై ఎన్నో జోక్స్ కూడా వచ్చాయి.. ఇది చాలా కాలంగా విమర్శలు, చర్చలు జరుగుతున్న అంశం. దీనిపై ఇప్పుడు ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి డాక్టర్ చేతిరాతపై ఫిర్యాదుతో కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సంచలనాత్మకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
పాముకాటుకు గురై కొడుకు చనిపోవడంతో వైద్యుల చేతిరాతపై రసానంద భోయ్ కోర్టును ఆశ్రయించారు. పోస్టుమార్టం రిపోర్టుతో సహా వైద్యులు ఏం రాస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని, చాలా కేసుల్లో పోలీసులు, కోర్టులు కూడా స్పష్టమైన తీర్పు వెలువరించలేకపోతున్నాయని కేసును విచారించిన ఒరిస్సా హైకోర్టు పేర్కొంది. ఈ కారణంగా ఇక నుంచి వైద్యులు వంకరగా రాసే విధానాన్ని వదిలిపెట్టి పెద్ద అక్షరాలతో రాయాలని లేదా అర్థమయ్యేలా స్పష్టంగా, శుభ్రంగా రాయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను కూడా కోర్టు ఆరోగ్య శాఖకు అప్పగించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ క్లినిక్‌లు, మెడికల్ కాలేజీలు, మెడికల్ సెంటర్లలో కూడా దీన్ని అమలు చేయాలని కోర్టు సూచించింది.
ఒరిస్సా హైకోర్టు 2020లో ఇదే విధమైన ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ దరఖాస్తుతో పాటు ప్రిస్క్రిప్షన్‌ను ఖైదీ చదవలేని పరిస్థితుల్లో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ రూల్స్‌ను మన దగ్గర కూడా పెట్టాలి. కొందరు రాసే ప్రిస్క్రిప్షన్లు మరీ దారుణంగా ఉంటాయి. ఒక్కోసారి అవి మందుల షాప్ వాళ్లకు కూడా అర్థంకావు.. కన్ఫ్యూజన్‌లో వేరేవి ఇచ్చేస్తుంటారు.
COMMENTS