BANK LOAN: In which bank to take loan? These are the 6 big banks that give low interest loans!
Bank Loan: ఏ బ్యాంక్‌లో లోన్ తీసుకోవాలి? తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న 6 పెద్ద బ్యాంకులు ఇవే!
మీకు లోన్ కావాలా? అయితే ఏ బ్యాంక్‌లో తీసుకోవాలో తెలియడం లేదా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
మీరు లోన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఏ బ్యాంక్‌లో పర్సనల్ లోన్ తీసుకుంటే మంచిదో తెలియడం లేదా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంక్ ప్రతిపదికన లోన్ వడ్డీ రేటు మారుతుంది. అందుకే తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోవాలి.
మనం ఇప్పుడు చౌక వడ్డీ రేటుకే పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఏవో తెలుసుకుందాం. దిగ్గజ బ్యాంకుల్లో ఏ బ్యాంక్‌లో వడ్డీ రేటు అందుబాటులో ఉందో చూద్దాం. వడ్డీ రేటు ఆధారంగా ఈఎంఐలో మార్పు ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పర్సనల్ లోన్స్‌పై అయితే 10.5 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తోంది. ఇది గరిష్టంగా 24 శాతం వరకు పడొచ్చు. వేతన జీవులకు ఇది వర్తిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 4,999 ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్‌లో గమనిస్తే.. పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.65 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. అలాగే గరిష్టంగా వడ్డీ రేటు 16 శాతం వరకు పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 2.5 శాతం వరకు ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో చూస్తే.. ఇందులో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.99 శాతం నుంచి పడుతుంది. అయితే గరిష్టంగా ఎంత వడ్డీ రేటు ఉంటుందో బ్యాంక్ వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో లేదు. ప్రాసెసింగ్ ఫీజు 3 శాతం వరకు చెల్లించుకోవాలి.
ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో అయితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 10.25 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా వడ్డీ రేటు 26 శాతం వరకు పడుతుంది. లోన్ టెన్యూర్ 72 నెలల వరకు పెట్టుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు 3 శాతం దాకా ఉంటుంది.
ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విషయానికి వస్తే.. ఈ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11.3 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే 13.8 శాతం వరకు వడ్డీ రేటు ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్త్ది.
బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే వ్యక్తి గత రుణాలపై 11.9 శాతం నుంచి వ్డడీ రేటును వసూలు చేస్తోంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు ఇది వర్తిస్తుంది. అదే కార్పొరేట్ ఉద్యోగులకు అయితే 12.4 శాతం నుంచి వడ్డీ పడుతుంది. గరిష్ట వడ్డీ రేటు 16.75 శాతం వరకు ఉంటుంది.
అందువల్ల మీరు బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ పొందాలని భావిస్తే.. వడ్డీ రేటు చెక్ చేసుకోవాలి. ఇకపోతే లోన్ పొందాలంటే బ్యాంక్ స్టేట్‌మెంట్, పే స్లిప్, ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, ఆధార్, ఐటీఆర్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
COMMENTS