APPSC DL Recruitment: APPSC Notification Released for 240 DL Posts in Degree College...
APPSC DL Recruitment: డిగ్రీ కళాశాలలో 240 డీఎల్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల...
👉APPSC DL Recruitment Notification 2023: ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త వినిపించింది. ఈ మేరకు రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ (DL Posts) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్ (APPSC DL Notification) విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు : 240
▪️ బోటనీ: 19 పోస్టులు
▪️ కెమిస్ట్రీ: 26 పోస్టులు
▪️ కామర్స్: 35 పోస్టులు
▪️ కంప్యూటర్ అప్లికేషన్స్: 26 పోస్టులు
▪️ కంప్యూటర్ సైన్స్: 31 పోస్టులు
▪️ ఎకనామిక్స్: 16 పోస్టులు
▪️ హిస్టరీ: 19 పోస్టులు
▪️ మ్యాథమెటిక్స్: 17 పోస్టులు
▪️ ఫిజిక్స్: 11 పోస్టులు
▪️ పొలిటికల్ సైన్స్: 21 పోస్టులు
▪️ జువాలజీ: 19 పోస్టులు
👉అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్డ్ లేదా నెట్/ స్లెట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉వయస్సు :18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్మెన్/ ఎన్సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - 150 ప్రశ్నలు- 150 మార్కులు- 150 నిమిషాలు; పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు 150 ప్రశ్నలు- 300 మార్కులు- 150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కుకాగా.. పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇక ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
👉కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.
👉 పరీక్ష విధానం పూర్తి వివరాలు :
👉 దరఖాస్తుల ప్రారంభతేది: 24/01/2024
👉 దరఖాస్తులకు చివరితేది: 13/02/2024
👉 Website : https://psc.ap.gov.in
COMMENTS