Application Form For Sanction Of New Meeseva Center in Telangana.
మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
ఇందుమూలంగా ఇట్టి పత్రిక ప్రకటన ద్వార తెలియజేయునది ఏమనగా నాగర్ కర్నూల్ జిల్లా లో ఈ క్రింద పేర్కొన్న ప్రదేశములలో మీ సేవ కేంద్రములు నెలకొల్పుటకు ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్తుల నుండి నిర్ణీత నమయమున, దరఖాస్తు ఫారంలో తేది: 23.01.2024 సోమవారం లోగా సంబందిత మండల తహశిల్దార్ గారి కార్యాలయములో సరైన ధృవ పత్రముల యుక్తంగా స్వయంగా సమర్పించుటకు కోరనైనది.
దరఖాస్తు చేయుటకు ఈ క్రింది పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా పాటించవలెను. మరియు ప్రభుత్వ ఉద్యోగి (కేంద్ర మరియు రాష్త్ర ప్రభుత్వము), సాఫ్ట్ వేర్ ఉద్యోగి కలిగిన కుటుంబ సభ్యులు మీసేవ ధరకాస్తుకు అనర్హులు.
1) అభ్యర్తి మీ సేవ ఏర్పాటు చేయు గ్రామ పంచాయతి స్థానికుడై ఉండవలెను.
2) దరఖాస్తు దారుని వయస్సు 18 సం// నుండి 35 సం//ల లోపు ఉండవలెను.
3) కనీస విద్యార్హత డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండవలెను.
4) కంప్యూటర్ గురించి అవగాహన కలిగి ఉండవలెను.
5) ఎంపికైన అభ్యర్థి మీ సేవ కేంద్రం ఏర్పాటు చేయుటకు తగిన ఆర్తిక స్తోమత కలిగి ఉండవలెను
6) దరఖాస్తు దారులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై వ్రాత పరీక్ష నిర్వహించబడును.
7) మౌఖిక పరీక్ష నిర్వహించబడును.
8) COLLECTOR AND CHAIRMAN DISTRICT e-GOVERNANCE SOCIETY” డి.డి. Rs.500/- తీసి ఫారం వెంబడి జత చేయవలెను.
మీ సేవ కేంద్రములు ఏర్పాటు చేయదలిచిన ప్రదేశములు/గ్రామాలు:
S/No మండలము గ్రామము
01 కోడేర్ తాడూర్
02 కోడేర్ తాడూర్
03 వంగూర్ కొండారెడ్డిపల్లి
04 తాడూర్ తాడూర్
* పై కనబడిన విధంగా సూచనలు పాటిస్తే www.nagarkurnool.telangana.gov.in వెబ్ సైట్ నుండి దరఖాస్తు ఫారం ను డౌన్ లోడ్ చేసుకొని సంబందిత తహశిల్దార్ గారి కార్యాలయము నందు పని చేయు వేళలో అనగా ఉదయం: 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సమర్పించవలెను.
మొత్తం మార్కులు: 100
1. బహులైచ్చిక ప్రశ్నా విదానం: (70 మార్కులు)
2. మౌఖిక విదానం: (30 మార్కులు) సమయం: 70 నిముషాలు
3. 1:3 పద్ధతిలో ఇంటర్యూకు పిలువబడును.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS