Will Copy: Is a certified copy of a will legally valid..? Expert advice
Will Copy: వీలునామా సర్టిఫైడ్ కాపీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా..? నిపుణుల సూచనలు..
ఆర్థిక వ్యవహారాలపై సరైన అవగాహన లేకపోతే అనవసరమైన ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వారసత్వ ఆస్తులు పొందడం, స్థిరాస్తులు అమ్మడం వంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఉదాహరణకు ఓ వ్యక్తి తల్లి మరణించక ముందు ఓ వీలునామా రాశారు. అందులో అతనికి, అతని సోదరికి స్థిరాస్తులు, రూ.10 లక్షల విలువైన షేర్లు చెందాలని రాశారు. అయితే నెలరోజుల క్రితం ఆ వ్యక్తి పూర్వీకుల ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో అసలు వీలునామా కాలిపోయింది. అయితే ఆ వీలునామా రిజిస్టర్ చేసి ఉండటంతో, ఓ కాపీని పొందే అవకాశం ఉంది. అయితే వీలునామా కాపీని ఎలా పొందాలి? చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? లేదా అనేది తెలుసుకుందాం. దీనికి సంబంధించిన వివరాలు ‘లైవ్‌మింట్’కు వెల్లడించారు కార్పొరేట్ ఆఫీస్ రజనీ అసోసియేట్స్ పార్ట్‌నర్ ఆరాధనా భన్సాలీ.
తల్లి మరణించక ముందు రాసిన వీలునామా రిజిస్ట్రేషన్ పూర్తయింది. వీలునామా సంబంధిత సబ్-రిజిస్ట్రార్ వద్ద సబ్మిట్ చేసి ఉంటే, దానిని రిజిస్టర్డ్‌గా భావించవచ్చు. ఇలాంటప్పుడు వారసులు ఇద్దరూ వీలునామా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పేర్కొంటూ వీలునామా సర్టిఫైడ్ ట్రూ కాపీ కోరవచ్చు. ఇందుకు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వీలునామా సర్టిఫైడ్ ట్రూ కాపీని వర్తించే చట్టాల ప్రకారం ద్వితీయ సాక్ష్యంగా(సెకండరీ ఎవిడెన్స్)గా పరిగణించవచ్చు. సివిల్ కోర్టు నుంచి అవసరమైన అధికారాన్ని కోరుతున్నప్పుడు.. మరణించిన తల్లి ఉద్దేశాల ప్రామాణికతను నిర్ధారించడం అత్యవసరం. ఈ ప్రక్రియలో సంబంధిత సమయంలో వీలునామాను ధ్రువీకరించిన సాక్షుల నుంచి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
లైవ్‌మింట్ రిపోర్ట్ ప్రకారం.. మరో సమస్యకు కూడా ఆరాధనా భన్సాలీ సమాధానం ఇచ్చారు. అదేంటంటే.. ఓ వ్యక్తికి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ ఉంది. అతను ప్రస్తుతం యూఎస్ వెళ్లాలని అనుకుంటున్నాడు, ఫ్లాట్ విక్రయించాలని భావిస్తున్నాడు. మరి ఇందుకు సేల్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయాలా? కో-ఆపరేటివ్ సొసైటీలో ఫ్లాట్లను తిరిగి అమ్మడానికి ఎలాంటి షరతులు వర్తిస్తాయి? అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత చట్టం ప్రకారం, రూ.100 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్థిరాస్తిలో యాజమాన్య హక్కుల బదిలీ ఏదైనా రిజిస్టర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఫ్లాట్ సేల్ అగ్రిమెంట్‌కి సంబంధించిన పార్టీలు ఇన్‌స్ట్రుమెంట్ ‘సేల్ డీడ్’ని సంబంధిత సబ్-రిజిస్ట్రార్ ఆఫ్ అస్యూరెన్స్ ఆఫీస్‌లో స్టాంప్ చేసి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ ఉంది కాబట్టి, తమ సభ్యత్వ హక్కులను బదిలీ చేయాలని చూస్తున్న వ్యక్తులు, కాబోయే కొనుగోలుదారు సొసైటీ సంబంధిత ఉప చట్టాలకు లోబడి ఉండాలి. సభ్యత్వం బదిలీ జరగడానికి ముందు ఉప చట్టాలలో వివరించిన నియమాలు, నిబంధనలకు ఇది కట్టుబడి ఉంటుంది. ఈ ప్రక్రియలో సొసైటీలోని ఉప చట్టాల ద్వారా నిర్దేశించిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి.
COMMENTS