Trending: Love for mother.. See how far it finally brought him..
Trending: తల్లిపై ప్రేమ.. చివరకు అతడిని ఎంత వరకు తీసుకొచ్చిందో చూడండి..
ప్రస్తుతం ఈ తరం యువత డిగ్రీ, బీటెక్ లేదంటే ఎంటెక్ పూర్తి చేసి ఏదో ఒక కంపెనీలో జాబ్ చేసి డబ్బులు సంపాదించాలి. లేదంటే పుస్తకాలతో కుస్తీ చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. ఇది ప్రస్తుతం ఉన్న యువతలో ఆలోచన. అయితే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని.. అందులో సేంద్రీయ వ్యవసాయం చేయాలని ఎవరో ఒకరు మాత్రమే ఆలోచిస్తారు. అలా వినూత్నంగా ఆలోచించిన వారిలో ఒక్కరే వరంగల్ మట్టవాడకు చెందిన మాడిశెట్టి హర్షవర్ధన్.
మాడిశెట్టి హర్షవర్ధన్ స్కేటింగ్ కోచ్. డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్ఎల్ బి చేస్తున్నాడు. అతడి తల్లి పింగిలి కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్ పనిచేస్తుంది. అందరి యువకుల లాగానే ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. మామూలుగా ఇంట్లో ప్రతిరోజు సేంద్రీయ కూరగాయలనే వాడుతుంటాడు. కరోనా సమయంలో హర్షవర్ధన్ తల్లి ప్రతిభకు మహమ్మారి సోకింది.
దీంతో ప్రతిరోజు ఉదయం నిమ్మరసంతో తేనె కలిపి తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో మార్కెట్లో తేనెను తీసుకువచ్చాడు. ఆ తేనె హర్షవర్ధన్ కు నచ్చేది కాదు. ఈ క్రమంలో స్వచ్ఛమైన తేనె కోసం ఆన్ లైన్లో అన్వేషించాడు. అసలు తేనె ఎలా తయారవుతుంది ఎలా ఉత్పత్తి చేస్తారని వెతక సాగాడు. చివరికి హైదరాబాద్ లో శిక్షణ అనంతరం హైదరాబాదులోనే తేనెటీగలు పెంచే బాక్సులను కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. ఒక్కో బాక్స్ ధర సుమారు పదివేల రూపాయల నుండి 15వేల రూపాయలు ఉంటుంది. అలా రెండింటిని కొనుగోలు చేశాడు. ఒక్కో బాక్స్ లో 50 వేల నుండి లక్ష వరకు ఈగలు ఉంటాయి. ఆ బాక్స్లను తాను శిక్షణ ఇచ్చే స్కేటింగ్ రింగ్ వద్ద చెట్లపై ఉంచాడు. సుమారు 45 రోజుల్లో తేనెచేతికి వచ్చిందట.
రెండు బాక్సుల నుంచి తేనె వేరు చేయడం సాధ్యం కాదని మరో 10 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వరంగల్ శివారులోని స్తంభంపల్లిలో స్థానిక రైతు సహాయంతో పొలంలో ఉంచాడు. దీంతో మొదటిసారి 10 కేజీల స్వచ్ఛమైన తేనె వచ్చింది. ఆ తర్వాత ధైర్యం చేసి 100 బాక్సులు కొనుగోలు చేసి వాటిని వర్ధన్నపేట శివారులోని పంట చేనుల వద్ద ఉంచి తేనెటీగల పెంపకాన్ని కొనసాగించాడు. మంచి లాభం వచ్చాయి. దీంతో 200 బాక్సులు తెప్పించి అమ్మవారిపేటలో ఆవాల పంట వద్ద ఉంచాడు. అవి జన్యు మార్పిడి పంటలు కావడంతో బాక్సులోని తేనెటీగలు మృత్యు వాతపడి దీంతో తీవ్రంగా నష్టపోయాడు.
నష్టపోయిన అనంతరం నిపుణుల వద్ద హర్షవర్ధన్ మరింత శిక్షణ తీసుకొని సంవత్సరకాలంలో తేనె ఉత్పత్తిపై మంచి అనుభవం సంపాదించాడు. పూర్తి పరిజ్ఞానంతో తేనెలో సైతం వివిధ రకాల రుచులు ఉంటాయని తెలుసుకొని నలగొండ,సిద్దిపేట గ్రామాల్లో ఆవాలు, నువ్వులు, అల్లనేరేడు, ఉమ తులసి పంట రైతులతో మాట్లాడి పొలాల్లో కొన్ని బాక్సులను ఉంచాడు. ఈసారి ఆ బాక్సుల నుంచి 200 కేజీల తేనె వచ్చింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. దీంతో హర్ష ఆనందానికి హద్దు లేకుండా పోయిందట.
అయితే ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల మారిందిగా పబ్లిసిటీ చేసుకోలేని హర్షవర్ధన్ ప్రస్తుతం హనుమకొండలోని డిఐజి ఆఫీస్ ఎదురుగా చిన్న షెల్టర్ అద్దెకు తీసుకొని హర్ష నాచురల్ హనీ పేరుతో ఒక చిన్న స్టోర్ను ఏర్పాటు చేశాడు. మొదట్లో మార్కెటింగ్ కోసం ఇబ్బంది పడిన ప్రస్తుతం ఆన్లైన్ సేవలు, పరిచస్తుల ద్వారా అమ్మకాలు లాభసాటిగానే కొనసాగుతున్నాయని అంటున్నాడు. తేనెటీగల పెంపకం ఖర్చు, రిస్క్ తో కూడుకున్నది కనుక తేనె ఉత్పత్తి చేస్తున్న తనలాంటి వారికి ప్రభుత్వం రాయితీపై రుణంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని హర్షవర్ధన్ అంటున్నాడు.
COMMENTS