Train Ticket: More travel at less cost.. 56 days train journey with one ticket.. Book like this!
Train Ticket: తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం.. ఒకే టికెట్ తో 56 రోజుల ట్రైన్ జర్నీ.. ఇలా బుక్ చేసుకోండి!
Train Ticket: ప్రతిరోజు వందలాది మందిని తమ గమ్యస్థానాలకు రైల్వే వ్యవస్థ చేరుస్తూ ఉంటుంది. మనలో చాలామంది ఒకసారి కంటే ఎక్కువ సరే రైలులో ప్రయాణం చేసి ఉంటారు.
రైల్వే నెట్‌వర్క్ (Railway Network) విస్తృతంగా ఉన్న దేశాల్లో ఇండియా (India) ఒకటి. మన దేశంలో కశ్మీర్ (Kashmir) నుంచి కన్యాకుమారి (Kanyakumari) వరకు రైల్వే నెట్‌వర్క్, కనెక్టివిటీ ఉంది. ప్రతిరోజు వందలాది మందిని తమ గమ్యస్థానాలకు రైల్వే వ్యవస్థ చేరుస్తూ ఉంటుంది. మనలో చాలామంది ఒకసారి కంటే ఎక్కువ సరే రైలులో ప్రయాణం చేసి ఉంటారు.
అయితే చాలా మంది ప్రయాణికులకు రైల్వే అందించే సర్వీసులు గురించి తెలియదు. వేర్వేరు అవసరాల కోసం ప్రతి రోజూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు తాము వెళ్లాల్సిన గమ్యానికి టికెట్ బుక్ చేసుకుంటారు. మళ్లీ రావడానికి మరో టికెట్, ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడికి మరో టికెట్ బుక్ చేసుకుంటారు. కానీ, అలా చేయాల్సిన అవసరం లేదు.
ఇలా ప్రతి రోజూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారి కోసం ఐఆర్‌సీటీసీ.. ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ పేరిట సరికొత్త సర్వీస్ ప్రారంభించింది. అంటే ఒక టికెట్ కొనుగోలు చేస్తే 56 రోజులు వందల మైళ్ల దూరం ప్రయాణించవచ్చు.
భారతీయ రైల్వే అందిస్తున్న ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. రెగ్యులర్ రైలు టికెట్‌తో పోలిస్తే తక్కువకే సర్క్యులర్ జర్నీ టికెట్ లభిస్తుంది. ప్రయాణికులు తమకు వెసులుబాటు గల క్లాస్ బోగీ ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
ఒక ప్రయాణం ప్రారంభించి.. గరిష్టంగా 56 రోజులు ప్రయాణం చేసిన తర్వాత తిరిగి మొదటి రైల్వే స్టేషన్‌కు చేరుకునే వరకూ ఈ సర్క్యులర్ జర్నీ టికెట్’కు వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 56 రోజుల ప్రయాణంలో ఎనిమిది బ్రేక్‌లు తీసుకోవచ్చు.
మధ్యలో సెలెక్టెడ్ రైల్వేస్టేషన్లలో దిగి.. ఆ ప్రదేశంలో సందర్శించి తిరిగి ప్రయాణం కొనసాగించవచ్చు. ఉద్యోగ, వ్యాపార పనులపై పలు ప్రాంతాల్లో తిరిగే వారికి, ఒకేసారి ఎక్కువ విహార / తీర్థయాత్రలకు వెళ్లే వారికి ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ బెటర్ ఆప్షన్
సర్క్యులర్ జర్నీ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు రైల్వే డివిజనల్ మేనేజర్‌ను సంప్రదించాలి. ప్రయాణం ప్లాన్, బ్రేక్స్‌ను బట్టి టికెట్ ధర ఖరారు చేస్తారు. ప్రయాణం ప్రారంభించే స్టేషన్‌లో ఈ టికెట్ కొనుక్కోవాలి. సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇస్తారు. విడివిడిగా బుక్ చేసుకునే టికెట్ల ధర కంటే సర్క్యులర్ జర్నీ టికెట్ చౌక ధరకే లభిస్తుంది.
టికెట్ చెల్లుబాటు టైమ్, ప్రయాణం చేసే రోజులు, విరామ ప్రయాణానికి సంబంధించిన రోజులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని టికెట్ రేట్లను లెక్కిస్తారు. సర్క్యులర్ జర్నీ టికెట్లను ఏ తరగతిలోనైనా ప్రయాణానికి కొనుగోలు చేయవచ్చు. 400 కిలోమీటర్ల దూరానికి 1 రోజుగా నిర్ణయిస్తారు. ప్రయాణం చేయని రోజుల్లో 200 కిలో మీటర్లుగా ఒక రోజును లెక్కిస్తారు.
ఉదాహరణకు మీరు న్యూ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర రైల్వే నుంచి సర్క్యులర్ టికెట్ తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మీ ప్రయాణం న్యూఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర న్యూఢిల్లీలో ముగుస్తుంది. మీరు మథుర నుంచి ముంబై సెంట్రల్, మర్మాగోవా, బెంగళూరు సిటీ, మైసూర్, బెంగళూరు సిటీ, ఉదగమండలం, తిరువనంతపురం సెంట్రల్ మీదుగా కన్యాకుమారి చేరుకుని, అదే మార్గంలో న్యూఢిల్లీకి తిరిగి వస్తారు.
COMMENTS