Tax: Alert to tax payers.. Opportunity till December 15.. Then heavy penalty..
Tax: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. డిసెంబర్ 15 వరకే అవకాశం.. తర్వాత భారీ పెనాల్టీ..
Tax: 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ని డిసెంబర్ 15లోగా డిపాజిట్ చేయాలి. లేదంటే పెనాల్టీలు వర్తిస్తాయి. వడ్డీ కూడా పే చేయాల్సి ఉంటుంది.
ట్యాక్స్ పేయర్స్ అందరూ రూల్స్ ప్రకారం ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే, ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి ముందుగా చెల్లించే ఆదాయ పన్ను ఇది.
దీన్ని నాలుగు వాయిదాలలో చెల్లిస్తారు. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ని డిసెంబర్ 15లోగా డిపాజిట్ చేయాలి. లేదంటే పెనాల్టీలు వర్తిస్తాయి. వడ్డీ కూడా పే చేయాల్సి ఉంటుంది.
* అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
జీతం తప్ప అద్దె లేదా స్టాక్ గెయిన్స్ వంటి వాటి నుంచి అందే ఇన్‌కమ్‌కి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. లాటరీ ప్రైజెస్ సహా వివిధ ఆదాయాలకు ఇది వర్తిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ మొత్తాన్ని చెల్లించాలి. సాధారణ పన్నులా వార్షిక ప్రాతిపదికన ఒకేసారి చెల్లించరు, ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో వాయిదాలలో డిపాజిట్ చేయాలి.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 208 ప్రకారం.. రూ.10,000 కంటే ఎక్కువ ట్యాక్స్ లయబిలిటీ ఉన్న వ్యక్తులు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఉద్యోగస్తులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారవేత్తలు, ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించే వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. వయస్సు 60 ఏళ్లు దాటితే, ఎలాంటి వ్యాపారం చేయని వారికి అడ్వాన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.
* ఎప్పుడు చెల్లించాలి?
అడ్వాన్స్ ట్యాక్స్‌ను వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి త్రైమాసికంలో పే చేయాలి. దీని తేదీని ఆదాయ పన్ను శాఖ నిర్ణయిస్తుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు, ఈ తేదీలు జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి 15గా పేర్కొంది.
* ట్యాక్స్ ఎంత?
వాయిదాల వారీగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినా ఏడాది మొత్తానికి అడ్వాన్స్ ట్యాక్స్ కాలిక్యులేట్ చేస్తారు. ఒక సంవత్సరంలో ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో ముందుగా లెక్కించాలి. ఆదాయం నుంచి డిడక్షన్‌లు తీసివేసిన తర్వాత, ట్యాక్స్ శ్లాబ్ ప్రకారం మిగిలిన ఆదాయంపై ట్యాక్స్ లెక్కించవచ్చు. జూన్ 15న అడ్వాన్స్ ట్యాక్స్‌లో కనీసం 15 శాతం చెల్లించాలి.సెప్టెంబర్ 15లోగా 45 శాతం అడ్వాన్స్ ట్యాక్స్, డిసెంబర్ 15లోగా 75 శాతం అడ్వాన్స్ ట్యాక్స్, మార్చి 15లోగా 100 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి.
* అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే ఏమవుతుంది?
ఉద్యోగం చేసే వ్యక్తుల విషయంలో, ఉద్యోగం మారిన సందర్భంలో, కంపెనీలు తరచుగా TDSని డిడక్ట్ చేయవు, అలాంటప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీ క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ చెక్ చేసి, డిపాజిట్ చేయాలి. లేకపోతే ఛార్జీ విధిస్తారు, వడ్డీ కూడా చెల్లించాలి.
సెక్షన్ 234C కింద చెల్లింపులో జాప్యం జరిగిన ప్రతి నెల వాయిదా మొత్తంలో షార్ట్‌ఫాల్ అమౌంట్‌పై 1 శాతం వడ్డీని విధిస్తారు. మొత్తం పన్నుపై, 10 శాతం వరకు మార్జిన్ ఉంటుంది. అంటే పన్ను చెల్లింపుదారులు గడువులోపు చెల్లించాల్సిన మొత్తం పన్నులో 90 శాతం కంటే తక్కువ చెల్లిస్తే, సెక్షన్ 234B ప్రకారం పన్ను చెల్లింపుదారుడు షార్ట్‌ఫాల్ ఉన్న, జాప్యం కొనసాగుతున్న ప్రతి నెలలో 1 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఒక నెలలో కొంత భాగాన్ని కూడా పూర్తి నెలగా భావించి వడ్డీ లెక్కిస్తారు.
COMMENTS