Sukanya Samriddhi Yojana: Huge good news for those who have joined the Sukanya Samriddhi scheme.. Center's key decision!
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరిన వారికి భారీ గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం!
Sukanya Samriddhi Account : మీరు సుకన్య సమృద్ధి పథకంలో చేరారా? మీ పాప పేరుపై డబ్బులు చెల్లిస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే శుభవార్త.
Small Savings Interest Rates : మోస్ట్ పాపులర్ సేవింగ్ స్కీమ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అందించే సుకన్య సమృద్ధి యోజన కూడా ఒకటి. చాలా మంది ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆడ పిల్లలు ఉన్న కుటుంబాలు చాలా వరకు ఈ పథకంలో పెట్టుబడి పెడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు.
మీరు కూడా మీ పాప పేరుపే సుకన్య స్కీమ్ తెరిచి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే.. మీకు గుడ్ న్యూస్ అందింది. మోదీ సర్కార్ తాజాగా సుకన్య సమృద్ధి స్కీమ్‌పై వడ్డీ రేటును పెంచేసింది. దీని వల్ల ఆ పథకంలో చేరిన వారికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు.
మోదీ సర్కార్ తాజాగా స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందులో సుకన్య సమృద్ధి స్కీమ్ కూడా ఉంది. ఈ పథకంపై కూడా వడ్డీ రేటు పెరిగింది. ఎంత వరకు వడ్డీ రేటు పెరిగింది? ఇకపై ఎంత వడ్డీ వస్తుంది? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి స్కీమ్‌పై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు పైకి చేరింది. దీంతో ఇప్పుడు ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు 8.2 శాతానికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇది వరకు వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు పెంపు అనేది 2024 జనవరి నుంచి మార్చి కాలానికి వర్తిస్తుంది.
తాజా వడ్డీ రేటు పెంపుతో సుకన్య సమృద్ధి స్కీమ్‌పై వడ్డీ రేటు ఇతర పొదుపు పథకాల కన్నా గరిష్ట స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక స్కీమ్ మాత్రం సుకన్య సమృద్ధి స్కీమ్ అందించే వడ్డీ రేటును అందిస్తోంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌పై కూడా 8.2 శాతం వడ్డీ రేటు ఉంది. ఇప్పుడు సుకన్య సమృద్ధి స్కీమ్ కూడా ఇదే స్థాయిలో వడ్డీ రేటును ఆఫర్ చేయనుంది. కాగా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌పై ఈసారి వడ్డీ రేటును పెంచలేదు. స్థిరంగానే కొనసాగించింది.
కాగా పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరొచ్చు. ఆడ పిల్లల పేరుపై మాత్రమే ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేయగలం. ఆడ పిల్లలకు పదేళ్ల లోపు వయసు ఉండాలి. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లల పేరుపై సుకన్య సమృద్ధి అకౌంట్ తెరవొచ్చు.
ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అయితే 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్ కొనసాగించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు మీకు నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు.
మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత కొంత మేర డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి మెచ్యూరిటీ సమయంలో డబ్బులు పొందొచ్చు.
సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అంటే అటు రాబడి.. ఇటు పన్ను ఆదా రెండూ కూడా కలిసొస్తాయి.
COMMENTS