SBI: SBI shock for customers! The burden of EMIs will increase with MCLR increase!
SBI: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్! MCLR పెంపుతో పెరగనున్న EMIల భారం!
Business: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలెర్ట్. ఎస్‌బీఐ శుక్రవారం వివిధ టెన్యూర్‌లపై దాని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ని 5-10 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫిషియల్ వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త రేట్లు వన్ మంత్ టెన్యూర్‌కి 8.20%, త్రీ మంత్స్ టెన్యూర్‌కి 8.20%, సిక్స్ మంత్స్ టెన్యూర్‌కి 8.55%, ఒక సంవత్సరానికి 8.65%, రెండేళ్లకు 8.75%, మూడేళ్ల టెన్యూర్‌కి 8.85%గా ఉన్నాయి.
లేటెస్ట్ అప్‌డేట్‌కి సంబంధించి ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ‘CNBCTV18’తో మాట్లాడుతూ.. ‘వివిధ కాస్ట్ కాంపోనెంట్స్ పరిశీలన తర్వాత MCLR పెంచాం. అయితే లెండింగ్ రేటును ఇంకా పెంచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పాలసీ రేట్లు సరైన దిశలోనే ఉన్నాయి. పాలసీ రేట్లు మరింత పెరుగుతాయని నేను ఆశించడం లేదు.’ అని చెప్పారు. MCLRలో ప్రస్తుత పెంపు లోన్ గ్రోత్‌పై ప్రభావం చూపే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
ఈ నెల ప్రారంభంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొన్ని టెన్యూర్‌లపై MCLRని 5 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. HDFC బ్యాంక్ రుణాల కోసం సవరించిన రేట్లు 8.70 నుంచి 9.25% పరిధిలో ఉన్నాయి. ఇకపై ఇతర బ్యాంక్‌లు కూడా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బాటలోనే MCLRని పెంచవచ్చు. అయితే ఇది వాటి నిధుల వ్యయంపై ఆధారపడి ఉంటుంది.
ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ ఖతన్హర్ మాట్లాడుతూ.. ‘హై క్రెడిట్-టూ-డిపాజిట్ నిష్పత్తి, హై గ్రోత్ రిక్వైర్‌మెంట్లు ఉన్న బ్యాంకులు మాత్రమే MCLRని పెంచడానికి మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఈ బ్యాంకులకు డిపాజిట్ల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది.’ అని చెప్పారు.
2022 మే నుంచి సౌత్ ఇండియన్ బ్యాంక్ MCLR ఇప్పటికే 1.60% పెరిగిందని ఆ బ్యాంక్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ బిజు ఇ పున్నాచలీల్ పేర్కొన్నారు. భవిష్యత్తులో MCLR పెంపుదల ఊహించిన దాని కంటే తక్కువగా ఉండవచ్చని సూచించారు. సెంట్రల్ బ్యాంక్ రుణ రేట్లను పెంచినప్పటికీ, డబ్బును ఆకర్షించడానికి బ్యాంకులు అందించే డిపాజిట్ రేట్లు పెద్దగా పెరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రుణాలు, డిపాజిట్ రేటు పెంపు మధ్య ఈ అసమతుల్యత MCLRని మరింత పెంచే బ్యాంక్ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. 2022 మే నుంచి ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ రేటు 2.5% పెరిగినప్పటికీ, అదే సమయంలో బ్యాంకుల మధ్య సగటు MCLR 1.5% మాత్రమే పెరిగిందని చెప్పారు.
COMMENTS