New Year 2023 Gift Ideas: Give these gifts for the new year.. Friends will be happy
New Year 2023 Gift Ideas: కొత్త సంవత్సరానికి ఈ గిఫ్ట్స్ ఇవ్వండి.. ఫ్రెండ్స్ ఖుషీ అయిపోతారు.
New Year 2023 Gift Ideas: కొత్త సంవత్సరం రాగానే మన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు గిఫ్ట్స్ ఇవ్వడం ఆనవాయితీ. మీరు ఈ సంవత్సరం మీ స్నేహితులకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే, రూ.2000 బడ్జెట్‌లో ఇవ్వదగ్గ ఈ గిఫ్ట్స్‌ని ఓసారి పరిశీలించండి. ఇవి మీ ప్రియమైన వారికి బాగా నచ్చుతాయి.
Ear Buds:న్యూ ఇయర్ సందర్భంగా బహుమతిగా ఇవ్వడానికి ఇయర్ బడ్స్ ఒక గొప్ప ఆప్షన్. ఈ రోజుల్లో ఇవి ప్రతి ఒక్కరికీ అవసరమైనవిగా మారాయి. చిన్న హెడ్‌ఫోన్‌లుగా ఉండే ఇయర్‌బడ్‌లు ఈ రోజుల్లో ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. మంచి బ్రాండ్ ఇయర్‌బడ్‌లు మార్కెట్‌లో లేదా ఏదైనా షాపింగ్ వెబ్‌సైట్‌లో రూ.2000లోపు అందుబాటులో ఉంటాయి.
Wireless Speaker:మీరు మీ స్నేహితులు లేదా ప్రియమైన వారికి ఈ కాంపాక్ట్, స్టైలిష్ వైర్‌లెస్ స్పీకర్‌ని కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ వైర్‌లెస్ స్పీకర్ల సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. వాటి బరువు కూడా తక్కువగా ఉంటుంది. ఇవి ఛార్జింగ్ కోసం మైక్రో USB పోర్ట్‌ను కలిగి ఉంటాయి. ఇవి రెండు గంటల్లో ఛార్జ్ అవుతాయి. ఈ వైర్‌లెస్ స్పీకర్లు బ్లూటూత్ 5.0 వెర్షన్‌ను కూడా సపోర్ట్ చేస్తాయి. మీరు మార్కెట్‌లో రూ.2000లోపు మంచి నాణ్యమైన వైర్‌లెస్ స్పీకర్‌లను పొందగలరు.
Smart Watch:అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ స్మార్ట్ వాచీలను ఇష్టపడతారు. స్మార్ట్ వాచ్‌లలో మీరు మీ వర్కవుట్లను చెక్ చేసుకోవడం, హార్ట్ బీట్, పల్స్ రేట్, ఫోన్ కాల్‌లు, మెసేజ్ లను స్వీకరించడం, సంగీతాన్ని వినడం, అనేక ఇతర ఫీచర్‌లను పొందగలరు. మీరు మార్కెట్‌లో రూ.2000లలో నాణ్యమైన స్మార్ట్ వాచీలను పొందుతారు.
Bluetooth Headphones:మీరు కొత్త సంవత్సరం సందర్భంగా మీ కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ స్పీకర్లు 2 గంటల్లో ఛార్జ్ అవుతాయి. 50 గంటల పాటు రన్ అవుతాయి. మంచి బ్రాండ్ వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు మార్కెట్లో రూ.2000కి అందుబాటులో ఉన్నాయి.
COMMENTS