New Ration Cards: Good news for people.. This is the government's decision regarding new ration cards..!
New Ration Cards: ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఇదే..!
Telangana Government: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం కొన్ని కీలక ఆలోచనలు చేస్తోందట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలని లక్షలాది కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి. గత తొమ్మిదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ జరగకపోవడంతో ఎప్పుడెప్పుడు ఇందుకు సంబంధించిన జారీ ప్రక్రియ షురూ అవుతుందని జనమంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ దిశగా అడుగులేస్తుండటం ప్రజలకు శుభ పరిణామం. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా సరైన విధివిధానాలు రూపొందించి రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఎన్నో ఏళ్లుగా ప్రజలంతా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై రేవంత్ సర్కార్ ఇప్పటికే కసరత్తులు షురూ చేసింది. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి.. కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చలు జరిపారు.
కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా మంత్రి చర్చించారు. ఇప్పటికీ జారీ చేయబడి రేషన్ కార్డుల్లో దాదాపు 10 శతం మంది నెలనెల రేషన్ తీసుకోవడం లేదనేది ఓ అంచనా. అయితే ఇలాంటి రేషన్ కార్డులను తొలగించాలా? లేక వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే దానిపై కూడా అధికారులతో చర్చలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఇకపోతే కొత్త కార్డులకు అర్హులను ఏ ప్రాతిపదికన నిర్ణయించాలనే దానిపై గవర్నమెంట్ ఫోకస్ పెట్టిందట. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత ఉండాలి? అనే దానిపై చర్చలు నడుస్తున్నాయట. ఏదిఏమైనా రాష్ట్రంలో అసలైన అర్హులకే రేషన్ కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయట.
అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో ఈ సారి సరికొత్తగా ఆలోచనలు చేస్తోందట ప్రభుత్వం. సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు అనుసంధానం ఉండకూడదని భావిస్తోందట. సంక్షేమ పథకాలకు దృష్టిలో పెట్టుకొని ఈ సారి పెద్ద ఎత్తున రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
కొత్త రేషన్ కార్డుల జారీకి అతి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందట. అర్హులైన పేదలందరికీ న్యాయం జరిగేలా విధివిధానాలు రెడీ చేస్తున్నట్లు సమాచారం.
COMMENTS