Narishakti Savings account: Govt Bank Good news.. Special account for women.. Lots of benefits!
Narishakti Savings account: ప్రభుత్వ బ్యాంక్ శుభవార్త.. మహిళల కోసం స్పెషల్ అకౌంట్.. బోలెడు బెనిఫిట్స్!
Narishakti Savings account: బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ‘నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్’ను ప్రవేశపెట్టింది. 18 ఏళ్లు పైబడిన యువతులు, మహిళలు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పనిచేసే మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ సేవింగ్ స్కీమ్ తీసుకొచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
మహిళల అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. వారి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. నారీమణులు ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి బ్యాంకులు సైతం కృషి చేస్తున్నాయి. వారిలో పొదుపును ప్రోత్సహించడానికి ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్ ప్రవేశపెడుతున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ‘నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్’ను ప్రవేశపెట్టింది. 18 ఏళ్లు పైబడిన యువతులు, మహిళలు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పనిచేసే మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ సేవింగ్ స్కీమ్ తీసుకొచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
నారీశక్తి సేవింగ్స్ అకౌంట్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అకౌంట్ తీసుకున్న ఖాతాదారులకు వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ లభిస్తుంది. ఆరోగ్య బీమా & వెల్‌నెస్ ప్రొడక్టులపై డిస్కౌంట్, గోల్డ్ & డైమండ్ ఎస్‌బీ అకౌంట్ హోల్డర్లకు లాకర్ సౌకర్యాలపై రాయితీలు, ప్లాటినం SB అకౌంట్ హోల్డర్లకు ఉచిత సౌకర్యాలు వంటి బెనిఫిట్స్ ఉంటాయి. నారీ శక్తి సేవింగ్స్ ఖాతాను మొత్తం 5,132 BOI బ్రాంచ్‌ల్లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు తెలుసుకుందాం.
నారీశక్తి సేవింగ్స్ ఖాతా రూ.కోటి వరకు సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవర్‌తో వస్తుంది. దీంతో ఇది మహిళా ఖాతాదారుల భద్రత, రక్షణకు భరోసా ఇస్తుంది.
నారీ శక్తి సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేసే మహిళలు ఆరోగ్య బీమా, వెల్‌నెస్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇది వారి మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.
బంగారం, వజ్రాల ఎస్‌బీ ఖాతాదారులు లాకర్ సౌకర్యాలపై రాయితీలను పొందవచ్చు. దీంతో వారి విలువైన వస్తువుల భద్రతకు భరోసా ఉంటుంది.
ప్లాటినం హోదా కలిగిన ఖాతాదారులు వారి బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఆధారంగా మరింత విలువను జోడించే విధంగా వివిధ ఉచిత సౌకర్యాల నుంచి ప్రయోజనం పొందవచ్చు.
మహిళా ఖాతాదారులు రిటైల్ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
నారీ శక్తి సేవింగ్స్ ఖాతాదారులు ఉచిత క్రెడిట్ కార్డ్ సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు. లావాదేవీల విషయంలో ఇది మరింత ఎక్కువ ఆర్థిక సౌలభ్యాన్ని ఇది అందిస్తుంది.
నారీశక్తి ఖాతాదారులు అధిక వినియోగ పరిమితి నుంచి ప్రయోజనం పొందవచ్చు. పాయింట్-ఆఫ్-సేల్ (POS) లావాదేవీలపై గరిష్టంగా 5 లక్షల వరకు లిమిట్ ఉంటుంది. దీంతో సులభంగా భారీ కొనుగోళ్లు చేయవచ్చు.
‘నారీ శక్తి సేవింగ్స్ ఖాతా అనేది సాధారణ సేవింగ్ ఖాతా మాత్రమే కాదు. సొంత ఆదాయ వనరుతో పని చేసే మహిళలకు మద్దతు ఇవ్వడానికి ఆర్థిక పొదుపు సాధనంగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు, ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదించడానికి దీని ద్వారా అవకాశం ఉంటుంది. ఒక కొత్త నారీ శక్తి ఖాతా తెరిచినప్పుడు, బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధికి రూ. 10 విరాళం ఇస్తుంది. ఈ మొత్తాన్ని వెనుకబడిన మహిళలు, బాలికల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి వినియోగిస్తాం.’ అని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
COMMENTS