Luxury Vacation: Dating company's amazing offer.. Free trip worth Rs. 26 lakh..
Luxury Vacation: డేటింగ్ కంపెనీ అదిరిపోయే ఆఫర్.. రూ.26 లక్షల విలువైన ట్రిప్ ఫ్రీ..
Luxury Vacation: ఇగ్నైట్ డేటింగ్ అనే డేటింగ్ కంపెనీ, అమెరికాలోని ఫ్లోరిడాలో రూ.26 లక్షల విలువైన విలాసవంతమైన సౌకర్యాలతో మరిచిపోలేని విహారయాత్రను ఫ్రీగా ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం అందిస్తోంది.
చాలా మందికి ప్రపంచాన్ని చుట్టి రావాలని, అందమైన ప్రదేశాలలో గడపాలని, అడ్వెంచర్స్ థ్రిల్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ట్రావెల్ చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. మరికొందరు బ్రెయిన్ రీఫ్రెష్ చేసుకోవడానికి టూర్లు ప్లాన్ చేస్తారు. లవ్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు రొమాంటిక్ డెస్టినేషన్స్‌కు తరచుగా వెళ్లి వస్తుంటారు. కానీ చాలా మందికి ఈ విషయంలో బడ్జెట్ ఆందోళనగా ఉంటుంది. ప్రయాణ ఖర్చులు భరించలేక ట్రిప్స్ క్యాన్సిల్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి ఇగ్నైట్ డేటింగ్ అనే సంస్థ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఫ్లోరిడాలో లగ్జరీ ట్రిప్‌ను ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తోంది.
ఇగ్నైట్ డేటింగ్ అనే డేటింగ్ కంపెనీ, అమెరికాలోని ఫ్లోరిడాలో రూ.26 లక్షల విలువైన విలాసవంతమైన సౌకర్యాలతో మరిచిపోలేని విహారయాత్రను ఫ్రీగా ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం అందిస్తోంది. సింగిల్స్‌కు సన్‌షైన్ స్టేట్‌లో బ్లైండ్ డేట్ అడ్వెంచర్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే అకామిడేషన్, ఎక్సైటింగ్ యాక్టివిటీస్‌ని ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ అద్భుతమైన అవకాశం ఎలా పొందాలో చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సమ్మర్ వెకేషన్ స్పాట్‌గా ఫ్లోరిడా పాపులర్ అయింది. ఇక్కడ నేచురల్ సీనరీస్, అందమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రతిదీ ఎంజాయ్ చేయవచ్చు. థ్రిల్లింగ్ బ్లైండ్ డేట్ అడ్వెంచర్‌కి సిద్ధంగా ఉన్న 25 నుంచి 60 ఏళ్ల వయస్సు గల సింగిల్స్, ఈ ట్రిప్‌కు అర్హులు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆఫర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 మధ్య మాత్రమే వ్యాలీడ్ అవుతుంది.
ఈ టూర్‌కు ఎంపికైన అభ్యర్థులకు రూ.26 లక్షల విలువైన సౌకర్యాలతో విలాసవంతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తారు. ఈ అసాధారణమైన బ్లైండ్ డేట్ చాలా రకాలా ప్రయోజనాలు అందిస్తుంది. విలాసవంతమైన విల్లాలు, ఉన్నత స్థాయి హోటళ్లలో ఉండవచ్చు. యాత్ర అంతటా సౌకర్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. అన్ని ఫుడ్, ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్‌ను కవర్ చేస్తారు. పాల్గొనేవారు ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్వాదించవచ్చు. విమానాశ్రయానికి చేరుకోవడం మాత్రమే అభ్యర్థుల బాధ్యత. ప్రైవేట్ రూమ్‌లు, సూట్‌లలో ప్రైవసీ, కంఫర్ట్ ఆస్వాదించవచ్చు.
టూర్‌కు ఎంపికైన వ్యక్తులు వివిధ అట్రాక్షన్‌లు ఎక్స్‌ప్లోర్ చేయడానికి, థ్రిల్లింగ్ యాక్టివిటీలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఓర్లాండో, సెంట్రల్ ఫ్లోరిడా, అన్నా మారియా ఐలాండ్ వంటి ఐకానిక్ లొకేషన్‌లను చుట్టిరావచ్చు. వైల్డ్‌లైఫ్ రిజర్వ్, ఎలిగేటర్ జిప్ లైన్‌ని సందర్శించవచ్చు. ఫ్లోరిడాలోని విభిన్న వన్యప్రాణులను చూడవచ్చు. జెట్ స్కీయింగ్ థ్రిల్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. డాల్ఫిన్ స్పాటింగ్ కోసం క్రూయిజ్‌లో ప్రయాణించవచ్చు.
ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ https://www.ocean-florida.co.uk/the-ultimate-test/లో అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన దరఖాస్తుదారులను పర్సనాలిటీ టెస్ట్‌కి ఆహ్వానిస్తారు. అలానే డేటింగ్ విష్‌లిస్ట్ గురించి మరింత వివరించే షార్ట్ వీడియో పంపాలి. కంపెనీ మ్యాచ్ మేకర్ దరఖాస్తుదారులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. డేటింగ్ ప్రాధాన్యతలు, ప్రత్యేక అవసరాల గురించి తెలుసుకోవడానికి కాల్ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ అన్ని దశలు పూర్తయిన తర్వాత లక్కీ విన్నర్స్‌ని సంప్రదిస్తారు.
COMMENTS