LPG KYC Online: Is there a queue at the gas agency? Do KYC online simply
LPG KYC Online | ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు సింపుల్‌గా ఆన్‌లైన్‌లో కేవైసీ చేయొచ్చు. బయోమెట్రిక్ కోసం ఏజెన్సీకి వెళ్లాల్సి ఉంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో (Congress 6 Guarantees) రూ.500 కే గ్యాస్ సిలిండర్ హామీ కూడా ఒకటి. త్వరలోనే ఈ గ్యారెంటీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది. దీంతో తమకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా లేదా? గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రావాలంటే ఏం చేయాలి? కేవలం రూ.500 కే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder for Rs 500) ఎలా పొందాలి? అని ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు. ప్రభుత్వం నిబంధనలు ప్రకటించకపోయినా, తమకు ఈ స్కీమ్ వర్తించకుండా పోతుందేమోనని ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. అందుకే కేవైసీ అప్‌డేట్ చేయడానికి గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.
తెలంగాణలో దాదాపు అన్ని గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కేవైసీ అప్‌డేట్ చేయాలని అనేక మంది డీలర్ల దగ్గర క్యూకడుతున్నారు. మరోవైపు ఈ స్కీమ్ మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తమ పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ను తమ భార్య పేరు మీదకు మార్చాలంటూ పురుషులు క్యూకడుతున్నారు. దీంతో గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూలు పెరిగిపోతున్నాయి.
గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు డీలర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే కేవైసీ అప్‌డేట్ చేయొచ్చు. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సంస్థలు ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి. అయితే దీనిపై అవగాహన లేక ప్రజలు గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూకడుతున్నారు. మరి ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్ చేయడానికి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవండి.
COMMENTS