Intellectual Power: This is the best way to increase the intellectual power of children..
Intellectual Power: చిన్నారుల మేధోశక్తి పెరుగుదలకు.. ఇదే చక్కటి మార్గం..
సెల్ఫోన్స్ , ఎలక్ట్రానిక్ పరికరాలతో రోజంతా యువకులు కుస్తీ పడుతున్న తీరును గమనిస్తుంటాం. అదే విధంగా వాటి వాడుకలో లీనమై చెడు అలవాట్లకు వ్యసనపడి వారి భవిష్యత్ ను వారి చేతుల ద్వారానే నాశనం చెసుకొంటున్న వ్యక్తులందరికి మరీ ముఖ్యంగా యుక్త వయసు పిల్లలకు స్థానిక బైరెడ్డిపల్లి మండల గ్రంథాలయ సిబ్బంది వహాబ్ మీ భవిష్యత్ ను చక్కటి మార్గం దిశగా తీసుకెళ్లే చక్కటి మార్గం గ్రంథాలయం వైపు నడిపిస్తున్నారు.
ప్రతి రోజు రోజు ఉదయం , సాయంకాలం మన చుట్టుపక్కల ఏమి జరుగుతోంది, కవులు, కవయిత్రిలు రాసిన కథలు, పూర్వ కథనాలు, భవిష్యత్ తరాలకు ఏమి నేర్పుతాయి.. రామాయణం, మహాభారతం యొక్క సారాంశం ఏమిటీ.. పోటీ పరీక్షలకు కావాల్సిన గైడ్ లైన్స్, కరెంట్అపైర్స్ వంటివి బైరెడ్డిపల్లి గ్రంథాలయంలో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
బైరెడ్డిపల్లి మండలంలోని గ్రంథాలయం ప్రతి రోజు ఉదయం 8.00 నుండి 11.00 వరకు సాయంకాలం 3.00 నుండి 5.00 గంటల వరకు తలుపు ద్వారాలు తెరిచే ఉంటాయి. ఈ పని వేళల్లో గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని వహబ్ కోరారు. గ్రంథాలయంలో ఉన్నటువంటి విషయ జనాన్ని పఠనం చేసి, పట్టించుకోవాలన్నారు. రోజు అలవాటు చేసుకొంటే మంచి నడవడిక అవలంబించుకోవచ్చని కోరారు.
చిన్నారులను ఇతర అలవాట్లకు బానిసలు కాకుండా చిన్న వయసులోనే గ్రంథాలయం బాట పట్టేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరారు. పోటీ పరీక్షలకు కావాల్సిన సూచనలు, సలహాలు, మెటీరియల్స్ గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయి. కొంత మందికి పరీక్షలకు కావాల్సిన మెటీరియల్స్ కొనుక్కోవడానికి కూడ స్థోమత ఉండదు. అటువంటి వారు గ్రంథాలయం బాట పడితే కావాల్సిన సమాచారం అందుతుంది.
COMMENTS