If you pay just Rs.20, you will get Rs.2 lakh benefit..Do you know about the scheme of this center?
జస్ట్ రూ.20 కడితే రూ.2 లక్షల బెనిఫిట్..ఈ కేంద్రం స్కీమ్ గురించి మీకు తెలుసా
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన(PMSBY) పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేకా వైకల్యం పొందినా ఈ స్కీమ్ అండగా ఉంటుంది. సహజ విపత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం వంటివి ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద కవర్ అవుతుంది. ఈ స్కీమ్ ప్రీమియంను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఏడాదికి రూ. 12 నుంచి రూ.20కి పెంచింది. ఈ పేమెంట్లకు ఆటో డెబిట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఆటో డెబిట్ పద్ధతిలో కట్ అవుతూ ఉంటుంది. జూన్ 1 తర్వాత ఆటో డెబిట్ పద్ధతి ద్వారా మీ అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినట్లయితే ఆ తేదీ నుంచి బీమా పథకం అమలు అవుతుంది.
ఈ పథకంలో చేరడానికి, మీరు http://www.jansuraksha.gov.in/Forms-PMSBY.aspx ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని, దానిని పూర్తి చేసి మీ బ్యాంకులో అందించాలి. కొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ఆధారిత నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు. 18-70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు. కానీ క్లెయిమ్ చేయాల్సి వచ్చిన సమయంలో లబ్ధిదారుడికి లేదా నామినీకి భారత కరెన్సీలో చెల్లింపు చేస్తారు. ఎవరైనా చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పథకంలో చేరినట్లైతే, క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు ఖాతాకు మాత్రమే చెల్లిస్తారు.
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద చందాదారుడు ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం చెల్లిస్తారు. ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా, రెండు చేతులు లేదా కాళ్ళు కోల్పోయినా దానిని శాశ్వత వైకల్యంగా గుర్తిస్తారు. అదే ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటి చూపు కోల్పోయినా దానిని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు.
COMMENTS