How To Block ADS: Are ads bothering you while watching a movie on your phone?
How To Block ADS: ఫోన్‌లో సినిమా చూస్తుంటే యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ సెట్టింగ్స్ చేస్తే కనిపించవు..!
How To Block ADS: మనం స్మార్ట్‌ఫోన్‌లో సినిమా చూసేటప్పుడు లేదా ఇంట్రెస్ట్ వీడియో చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వచ్చి ఇబ్బందిపెడుతుంటాయి. ఈ పరిస్థితిలో ఆ యాడ్ కంప్లీట్ అయ్యే వరకు మళ్లీ ఆ వీడియో కానీ సినిమా కానీ చూడలేరు.
ఇలాంటి సమయంలో చాలా చిరాకుగా ఉంటుంది. యాడ్స్ కారణంగా ఫోన్‌లో సినిమాలు చూడటం, గేమింగ్ లేదా ఏదైనా ముఖ్యమైన పని చేయడం కష్టమవుతుంది. ఇలా జరగకూడదంటే స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. యాడ్స్ శాశ్వతంగా దూరమవుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. ఇందుకోసం ముందుగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌కి వెళ్లాలి. తర్వాత Google ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
2. తర్వాత మేనేజ్ గూగుల్ అకౌంట్ ఆప్షన్‌కు వెళ్లాలి.
3. తర్వాత మీకు డేటాఅండ్ ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తుంది.
4. క్రిందికి స్క్రోల్ చేస్తే సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
5. మీకు ఏయే యాడ్స్ వస్తున్నాయో మీ యాక్టివిటీలలో ఏవి ట్రాక్ చేయబడతాయో ఇక్కడ సులభంగా చెక్ చేయవచ్చు.
6. సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కింద మీరు మై యాడ్ సెంటర్ ఆప్షన్ కనుగొంటారు.
7. మై యాడ్ సెంటర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
8. సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ ఆఫ్ చేయండి.
9. ఇలా చేసిన తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్‌పై క్లిక్ చేయండి. తర్వాత డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దాన్ని ఇక్కడ తొలగించండి
10. ఈ ప్రక్రియ తర్వాత మీరు రిపీట్ అయ్యే యాడ్స్ నుంచి బయటపడతారు. తర్వాత మీరు ఎలాంటి యాడ్స్ లేకుండా ఆన్‌లైన్ గేమ్‌లను ఆడవచ్చు కంటెంట్‌ను చూడవచ్చు. దీని వల్ల మీ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
COMMENTS