Gruha Lakshmi: Government's key decision on Gruha Lakshmi scheme.. New applications are always coming..!
Gruha Lakshmi: గృహలక్ష్మి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త దరఖాస్తులు ఎప్పటినుంచంటే..!
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గద్దెక్కిన ప్రభుత్వం.. పలు ఓల్డ్ స్కీమ్స్ విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రవేశపెట్టిన స్కీమ్స్ లో అవకతవకలు గుర్తిస్తూ వాటి స్థానంలో కొత్త అప్లికేషన్స్ తీసుకుంటోంది.
ఇందులో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న గృహలక్ష్మి అప్లికేషన్స్ పనికిరావని కాంగ్రెస్ గవర్నమెంట్ చెబుతోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు క్యాన్సిల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పాలక వర్గం.
గతంలో తీసుకున్న గృహలక్ష్మి అప్లికేషన్స్ స్థానంలో కొత్త దరఖాస్తులు తీసుకోవాలని నూతన ప్రభుత్వం నిర్ణయం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2023 బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థానంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రస్తావించి ఇంటిస్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించింది.
ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం, పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. దీంతో గృహలక్ష్మి పథకంపై గందరగోళం నెలకొంది. ఇంతలో ఈ పథకం విషయంలో ప్రభుత్వం ఎంతో కీలక నిర్ణయం తీసుకుందనే సమాచారం బయటకొచ్చింది.
పాత అప్లికేషన్స్ అన్నీ పక్కనబెట్టి కొత్తగా గ్రామ సభ ద్వారా గృహలక్ష్మి అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ పథకంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోందట.
రాష్ట్రంలో ఇల్లు లేని పేద వారికి ఇల్లు కట్టుకునే స్థలంతో పాటు రూ. 5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ఈ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు గృహలక్ష్మి పథకంలో కీలక మార్పులు చేసే దిశగా అడుగులేస్తున్నారు.
రాష్ట్రంలో గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకోవడానికి విధి విధానాలు రూపొందించే పనిలో ఉన్నారట అధికారులు. అతి త్వరలో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.
COMMENTS