Group 2 Coaching: Good News.. Free Group-2 Coaching!
Group 2 Coaching: గుడ్ న్యూస్.. ఉచితంగా గ్రూప్ -2 కోచింగ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా పరీక్షలకు సంబంధించి విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిరుద్యోగులైన ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ వెల్పేర్ కార్పొరేషన్ గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు జిల్లా మైనారిటీ అధికారులు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఇందుకు అర్హులని తెలుపారు. దీనికి సంబంధించి అభ్యర్థులు కర్నూలు పట్టణంలోని బిర్లా కాంపౌండ్‌లో ఉన్న శ్రీధర్స్ బ్యాంక్ కోచింగ్ సెంటర్లో ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
ఇందులో ఉమ్మడి జిల్లాలోనిమైనారిటీ విద్యార్థులకు గ్రూప్-2లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభం కానుండగా.. గ్రూప్ 2కు సంబంధించి శిక్షణ తీసుకువాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఉండాలి. అలాగే ముస్లిం, క్రిస్టియన్ బమీపీ, బుద్దిస్ట్, జైన్స్, సిక్కు, పార్సీస్ వర్గాలకు చెందిన విద్యార్థులై ఉండాలని తెలిపారు.ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోగా తమ శ్రీధర్స్ బ్యాంక్ కోచింగ్ సెంటర్‌లో సంప్రదించాలని తెలిపారు.
మరిన్ని వివరాలకు 9577484848 ఫోన్ నంబరుకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా పరీక్షలకు సంబంధించి విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. కాగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు ఇప్పటికే మొదలై 2024 జనవరి 10వ తేదీ దరఖాస్తు గడువు ముగియనుంది. కాగా రాష్ట్రంలో మొత్తం 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నట్లు APPSC పేర్కొంది. పే స్కేల్, వయస్సు, విద్యార్హత ఇతర వివరాలను ఏపీపీఎస్‌సీ సైట్లో ఉంచారు. అదే విధంగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షను 2024 ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు.
COMMENTS