Google Contacts: A great feature in Google Contacts.. You can see the location of your loved ones in the app itself..
Google Contacts: గూగుల్ కాంటాక్ట్స్‌లో అదిరిపోయే ఫీచర్.. ప్రియమైన వారి లొకేషన్ యాప్‌లోనే చూసుకోవచ్చు..
Google Contacts: గూగుల్ తన కాంటాక్ట్స్ యాప్‌లో లొకేషన్ షేరింగ్ (Location Sharing) ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్‌తో యాప్‌లోని కాంటాక్ట్స్‌ల రియల్-టైమ్ లొకేషన్ డేటాను యాక్సెస్ చేయవచ్చు.
Google Contacts: గూగుల్ కాంటాక్ట్స్ (Google Contacts) అనేది కోట్లాది డౌన్‌లోడ్స్‌తో ఆండ్రాయిడ్ యూజర్లలో సూపర్ పాపులర్ అయిన అడ్రస్ బుక్ యాప్. ఈ యాప్‌ను కాంటాక్ట్స్ మేనేజ్ చేయడానికి, మెర్జ్ చేయడానికి, వాటిని డివైజ్‌ల్లో సింక్ చేయడానికి, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. గూగుల్ దీనిలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది. తాజాగా కొత్త అప్‌డేట్‌లో భాగంగా లొకేషన్ షేరింగ్ (Location Sharing) ఫీచర్‌ను పరిచయం చేసింది.
* యాప్ లోనే లొకేషన్ ఫెసిలిటీ..
ఈ కొత్త ఫీచర్‌తో యాప్‌లోని కాంటాక్ట్స్‌ల రియల్-టైమ్ లొకేషన్ డేటాను యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా యాప్‌లోనే లొకేషన్ డీటైల్స్ పొందడానికి ఈ ఫీచర్‌ను యూజర్లు ఉపయోగించవచ్చని గూగుల్ తెలిపింది.
* కొత్త వెర్షన్‌లో లాంచ్
ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని, వారు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఫీచర్ అవుతుంది. గతంలో, కాంటాక్ట్స్ లొకేషన్‌ను మాన్యువల్‌గా షేర్ లేదా రిక్వెస్ట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, లేటెస్ట్ వెర్షన్ (4.22.37.586680692) యూజ్ చేస్తున్నవారు కాంటాక్ట్స్ యాప్ నుంచే ఆ పనులు చేయవచ్చు.
* ఫీచర్‌ను ఎలా వాడాలి?
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, యూజర్ వద్ద లొకేషన్‌ను షేర్ చేయాలనుకుంటున్న లేదా లొకేషన్‌ను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ జీమెయిల్ అడ్రస్ ఉండాలి. అలానే ఒకరి లొకేషన్‌ను యాక్సెస్ చేయాలంటే ముందు వారి అనుమతిని తీసుకోవాలి. రెండూ ఉన్నట్లయితే, వారి ప్రస్తుత లొకేషన్ చూపుతూ, కాంటాక్ట్స్ యాప్‌లో వారి పేరుతో గూగుల్ మ్యాప్స్ బాక్స్ కనిపిస్తుంది. ఇతర కాంటాక్ట్స్‌ను చేరుకునేందుకు లొకేషన్ డైరెక్షన్స్ పొందడానికి ఆ బాక్స్‌పై క్లిక్ చేయవచ్చు, లేదా వారే యూజర్ లొకేషన్‌కు చేరుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా సెటప్ చేయవచ్చు.
ఈ ఫీచర్ యాప్‌లను మార్చకుండా లేదా మెసేజ్‌లు పంపకుండా కాంటాక్ట్స్ లొకేషన్ సులభంగా చెక్ చేస్తుంది. టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం లేని వ్యక్తులకు, వృద్ధులకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ పెద్దగా నాలెడ్జ్ లేని వారు ఈజీగా కాంటాక్ట్స్ యాప్‌ని తెరిచి కుటుంబం, స్నేహితులు ఎక్కడ ఉన్నారో చూసుకోవచ్చు. వాస్తవానికి, కాంటాక్ట్స్ వారి లొకేషన్‌ను షేర్ చేయడానికి అంగీకరిస్తేనే ఈ ఫీచర్ పని చేస్తుంది. షేర్ చేయకూడదనుకుంటే దీన్ని ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు.
* ఎకో ఫ్రెండ్లీ రూటింగ్
గూగుల్ ప్రవేశపెట్టిన మరో కొత్త ఫీచర్ ఎకో ఫ్రెండ్లీ రూటింగ్. ఈ ఫీచర్ వాహనం ఇంజన్ రకం ఆధారంగా వివిధ మార్గాల ఫ్యూయల్/ ఎనర్జీ ఎఫిషియన్సీని చూపుతుంది. ఫ్యూయల్/ ఎనర్జీ ఎఫిషియన్సీని పరిగణనలోకి తీసుకుంటూ ట్రాఫిక్, బాడ్ రోడ్డు కండిషన్స్ లేని ఉత్తమ రహదారి మార్గాలను కూడా ఇది సూచిస్తుంది. ఈ ఫీచర్‌తో మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ రూట్ ఎంచుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు, పర్యావరణ ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చు. గూగుల్ మ్యాప్స్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్‌ని ఆన్ చేయవచ్చు.
COMMENTS