Don't you have voter card? This is a good chance.. Don't miss this chance at all.
మీకు ఓటర్ కార్డు లేదా..? ఇదే మంచి ఛాన్స్.. ఈ అవకాశం అస్సలు వొదులుకోవద్దు.
ప్రజలు తమ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎత్తారు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం..
ఇప్పుడు మరోసారి ఓటరు నమోదు, ఓటర్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చింది. త్వరలో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల ప్రక్రియ నమోదుకు శ్రీకారం చుట్టారు.
18 ఏండ్లు నిండే యువతకు ఓటు హక్కు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొని.. 2024 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండే వారు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20 నుంచి ఇప్పటికే ఉన్న ఓటర్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదుతోపాటు బోగస్ ఓట్ల తొలగింపు కూడా చేపట్టనున్నారట. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జనవరి 6న ముసాయిదా జాబితాను, అదేవిధంగా ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేసి రిలీజ్ చేస్తారు.
ఈ సారి ఓటు నమోదుపై పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించనున్నారట. ఓటు హక్కు ఆవశ్యకతను తెలుపుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సాహం అందించనున్నారు. ఓటర్ నమోదులో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటినీ తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఓటు నమోదు కోసం బీఎల్‌ఓలతో పాటు ఆన్‌లైన్‌లోనూ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అర్హులైన యువత ఓటు నమోదు చేసుకునేలా విద్యాసంస్థల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఓటు కోసం కళాశాలలోనే దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోబోతున్నారట.
కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఫారం-6 ఉపయోగించాలి. దీనికి రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు జతపరిచి సబ్మిట్ చేయాలి. ఓటర్ కార్డులో పేరు, పుట్టిన తేదీల్లో తప్పులను సవరించేందుకు ఫారం-8ను ఉపయోగించాలి. ఇందుకోసం 10వ తరగతి మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒకటి జతపర్చాలి. అదేవిధంగా అడ్రస్ మార్చేందుకు ఫారం- 8Aను ఉపయోగించాలి. గత చిరునామాతో ఉన్న గుర్తింపు కార్డు జిరాక్స్, ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి అర్జీ పెట్టాలి.
COMMENTS