Data Analytics: Is an IT job your goal? These popular data analytics certificate courses are for you.
Data Analytics: ఐటీ జాబ్ మీ లక్ష్యమా..? ఈ పాపులర్ డేటా అనలిటిక్స్ సర్టిఫికేట్ కోర్సులు మీకోసమే..
ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ బాగా పెరిగింది. అందులోనూ సాఫ్ట్‌వేర్ రంగంలో ఇతర నిపుణులతో పోలిస్తే డేటా అనలిస్ట్‌ల జీతాలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో యువత ఈ ఉద్యోగాలపై ఫోకస్ చేస్తోంది.
ప్రస్తుతం అన్ని రంగాల్లో డేటా అనాలిసిస్ కీలకంగా మారింది. దీని ఆధారంగానే కంపెనీలు బిజినెస్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయి. ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ బాగా పెరిగింది. అందులోనూ సాఫ్ట్‌వేర్ రంగంలో ఇతర నిపుణులతో పోలిస్తే డేటా అనలిస్ట్‌ల జీతాలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో యువత ఈ ఉద్యోగాలపై ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సులభంగా ఉద్యోగాలను అందించే డేటా అనలిటిక్స్ కోర్సులు ఏవో పరిశీలిద్దాం.
SAS స్టాటిస్టికల్ బిజినెస్ అనలిస్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సును.. ప్రిడిక్టివ్, స్టాటిస్టికల్ మోడలింగ్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవాలనుకునే డేటా అనలిస్ట్‌ల కోసం రూపొందించారు. ఈ ఆన్‌లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కోసం SAS ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి మూడు నెలలు. SAS ఉపయోగించి వ్యాపార ప్రయోజనాల కోసం మోడలింగ్, ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు.
* ఐబీఎం డేటా సైన్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్
ఐబీఎం డేటా సైన్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సు ద్వారా డేటా సైన్స్ రోల్స్‌లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి అంశాలను ఈ కోర్సు కవర్ చేస్తుంది. హ్యాండ్-ఆన్ ప్రాజెక్ట్స్ తప్పనిసరిగా పూర్తి చేస్తేనే సర్టిఫికేట్ జారీ చేస్తారు.
* ఐఐటీ కాన్పూర్ అడ్వాన్స్‌డ్ డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్ కోర్సు
Edvancer E&ICT అకాడమీ సహకారంతో ఐఐటీ కాన్పూర్ అడ్వాన్స్‌డ్ డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. డేటా అనలిటిక్స్‌లో సమగ్రమైన నైపుణ్యాన్ని ఇది అందిస్తుంది. టెక్ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తుల కోసం ఈ కోర్సును రూపొందించారు. ఇది ప్రధానంగా స్టాటిస్టికల్ మోడలింగ్, డేటా విజువలైజేషన్, డేటా అనలిటిక్స్, పైథాన్, టేబుల్‌యూ, SQL వంటి వంటి అంశాలపై ఫోకస్ చేస్తుంది. విభిన్న డొమైన్స్ నుంచి 7 ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌లు ఉంటాయి. కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ ఇస్తారు. కోర్సులో భాగంగా లైవ్ ఆన్‌లైన్ క్లాసెస్, వీడియో లెక్చర్స్ ఉంటాయి. కోర్సు మెటీరియల్ యాక్సెస్ నిరంతరం అందుబాటులో ఉంటుంది.
* ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ డేటా అనలిటిక్స్
అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఏడబ్ల్యూఎస్ ఉపయోగించి విశ్లేషణాత్మక పరిష్కారాలను అందించే నిపుణుల కోసం ఈ కోర్సు రూపొందించారు. డేటా నుంచి విలువైన సమాచారం సేకరించేందుకు AWS డేటా లేక్‌లను ఉపయోగించడంలో నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్స్ ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఐదేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా అమెజాన్ DAS-01 సర్టిఫికేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే వారికి సర్టికేట్ జారీ చేస్తారు.
* గూగుల్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్
డేటా అనలిటిక్స్‌లో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి గూగుల్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. డేటాను విశ్లేషించడానికి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని ఈ కోర్సు ద్వారా పొందవచ్చు. నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా వర్తింపజేయడానికి ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లు కూడా ఉంటాయి. ఈ కోర్సు పూర్తయిన తర్వాత డేటా అనలిటిక్స్‌లో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.
COMMENTS