Credit Cards: Are you using a credit card in an emergency? These tips are for you..
Credit Cards: అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఈ టిప్స్ మీకోసమే..
Credit Cards: ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో (Financial emergencies) క్రెడిట్ కార్డులను ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి.
జీవితంలో ఊహించని అవసరాలు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. మెడికల్ బిల్లుల నుంచి అత్యవసర ప్రయాణ ఖర్చుల వరకు ఏ రూపంలో నైనా అవసరం తలుపు తట్టవచ్చు. ఇలాంటి సందర్బాల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీటిని తెలివిగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో (Financial emergencies) క్రెడిట్ కార్డులను ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి.
* ప్రయాణ అవసరాలుకొన్ని క్రెడిట్ కార్డులు ట్రావెల్-రిలేటెడ్ ఫీచర్లను అందిస్తాయి. అనుకోకుండా ట్రావెల్ చేయాల్సినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. కొన్ని కార్డులు విమానాల టికెట్లు, హోటళ్ల బుకింగ్‌పై డిస్కౌంట్లు అందిస్తాయి. అనుకోని ప్రయాణాల సమయంలో ఖర్చులను తగ్గిస్తూ, మంచి ప్రయోజనాలను అందిస్తాయి.
* హౌస్ రెన్నొవేషన్ప్రకృతి వైపరీత్యాలు లేదా హౌస్ రెన్నొవేషన్ కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. మీ బడ్జెట్‌కు మించిన ఈ ఖర్చులను క్రెడిట్ కార్డులు తీరుస్తాయి. అయితే వివిధ కార్డుల వడ్డీ రేట్లను పరిశీలించి, నిర్దిష్ట కాలానికి తక్కువ రేట్లు ఉన్నవాటిని తీసుకోవాలి.
* జాబ్ పోయినప్పుడుఉద్యోగం పోతే ఎవరికైనా ఆర్థికంగా ఒత్తిడి ఎదురవుతుంది. ఈ సమయంలో క్రెడిట్ కార్డులు కొన్ని నెలల పాటు ఆదుకుంటాయి. అయితే అప్పులు ఎక్కువగా చేయకుండా జాగ్రత్త పడాలి. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి చెల్లించే మొత్తమే ఖర్చు పెట్టాలి.
* వాహనం సమస్యలుమీ వెహికల్స్ రిపేర్లకు అనుకోకుండా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు, క్రెడిట్ కార్డులను వాడటం మంచిది. ఇది మీ బడ్జెట్‌లోకి రాని ఖర్చు కాబట్టి, క్రెడిట్ కార్డులను యూజ్ చేయవచ్చు. అయితే ముందే రీపేమెంట్ ప్లాన్ వేసుకోవాలి.
* హెల్త్ ఎమర్జెన్సీఏవైనా అనారోగ్యాలకు ట్రీట్‌మెంట్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అలాంటప్పుడు హాస్పిటల్ బిల్లులు లేదా మందుల ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులు వాడటం మంచిది. అయితే ఖర్చు, అవసరాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఆ ప్రకారమే కార్డు వాడాలి
* క్యాష్ విత్‌డ్రా చేయొద్దుఅత్యవసర సమయాల్లో క్యాష్ విత్‌డ్రా చేయడానికి క్రెడిట్ కార్డులను ఉపయోగించడం మానేయండి. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్లపై ఎక్కువ ఫీజులు, వడ్డీలు వర్తిస్తాయి. క్యాష్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి.
* ఎడ్యుకేషన్ ఖర్చులుఎడ్యుకేషన్ అవసరాలకు క్రెడిట్ కార్డులను యూజ్ చేయవచ్చు. ఇలాంటప్పుడు కెరీర్ అవకాశాలు కోల్పోకుండా క్రెడిట్ కార్డులు కాపాడతాయి. అయితే ఫేవరబుల్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆఫర్లున్న క్రెడిట్ కార్డులను యూజ్ చేయండి. దీంతో లోన్ భారం మరింత బర్డెన్‌గా మారకుండా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
COMMENTS