Covid-19 JN.1 : There is no danger due to the variant of Covid-19 JN. World Health Organization.
Covid-19 JN.1 : కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వల్ల ప్రమాదం లేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న కొవిడ్-19 ఓమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ 1 వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వ్యాఖ్యలు చేసింది.
జేఎన్ 1 కరోనావైరస్ జాతి ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు కలిగించదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. జేఎన్ 1 సబ్ వేరియంట్ వల్ల ఎదురయ్యే ప్రజారోగ్య ప్రమాదం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా వేసింది. కొవిడ్ బీఏ 2.86 జాతికి చెందిన సబ్ వేరియంట్ జేఎన్ 1 అని ఆ సంస్థ వర్గీకరించింది.
కొవిడ్ వ్యాక్సిన్ తో రక్షణ
ప్రస్తుతం ఉన్న కొవిడ్ వ్యాక్సిన్‌లు కొవిడ్ -19 జేఎన్ 1 వైరస్ వల్ల మరణాల నుంచి రక్షణను కొనసాగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ 15 నుంచి 29 శాతం ఉందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఇతర వేరియంట్‌లతో పోలిస్తే జేఎన్ 1 ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తోందనడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని యూఎస్ వైద్యనిపుణులు చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్లు అమెరికన్లను జేఎన్ 1 సబ్ వేరియంట్ నుంచి రక్షించగలదని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ పేర్కొంది. కొవిడ్ -19 జేఎన్ 1 సబ్ వేరియంట్ అమెరికా దేశంలో సెప్టెంబరు నెలలో వెలుగుచూసింది. గత వారం చైనాలో ఈ కొత్త సబ్ వేరియంట్ ఏడుగురికి సోకిందని తేలింది.
దేశంలో పెరుగుతున్న కేసులు
కేరళ రాష్ట్రంలో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్క రోజే 142 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ పరీక్షలు పెంచడంతో పాటు ఈ కొత్త వేరియంట్ నివారణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు అన్ని రాష్ట్రాలు సమాయత్తమయ్యాయి.
COMMENTS