Business Idea: A business that earns Rs.6 lakhs annually with an investment of Rs.1 lakh.. See what it is..
Business Idea: రూ.1లక్ష పెట్టుబడితో ఏటా రూ.6 లక్షలు సంపాదించే వ్యాపారం.. అదేంటో చూడండి..
Business Idea: వంట పాత్రలు, ఓవెన్లు, టైల్స్, ఉపరితలాల నుంచి గ్రీజు, ధూళి, మరకలను శుభ్రం చేయడానికి స్క్రబ్బర్లను ఉపయోగిస్తారు. వీటికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది, సులభంగా విక్రయించవచ్చు.
వేరొకరి కోసం ఎక్కువ గంటలు పనిచేసి అలసిపోయారా? తక్కువ రిస్క్, ఎక్కువ లాభంతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే, ఇప్పుడే స్టార్ట్ చేయడానికి ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. అదే యుటెన్సిల్ స్క్రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ (Utensil Scrubber manufacturing) బిజినెస్. యుటెన్సిల్ స్క్రబ్బర్లు ప్రతి కిచెన్‌లో తప్పనిసరిగా ఉంటాయి. ఇంట్లో అయినా, హోటల్ అయినా లేదా రెస్టారెంట్ అయినా వీటితోనే పాత్రలు క్లీన్ చేస్తారు. వంట పాత్రలు, ఓవెన్లు, టైల్స్, ఉపరితలాల నుంచి గ్రీజు, ధూళి, మరకలను శుభ్రం చేయడానికి స్క్రబ్బర్లను ఉపయోగిస్తారు. వీటికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది, సులభంగా విక్రయించవచ్చు.
ప్రభుత్వం కూడా ఈ వ్యాపారానికి మద్దతు ఇస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకం కింద రూ.10 లక్షల వరకు బ్యాంకు లోన్ పొందవచ్చు. ఈరోజే ఈ యుటెన్సిల్ స్క్రబ్బర్ వ్యాపారాన్ని ప్రారంభించి ఏటా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సినవి ఏవో తెలుసుకుందాం.
* ఏమేం అవసరం?
జీన్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవసరం. ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఈ వ్యాపారాన్ని ఎలా స్థాపించాలి? విజయవంతంగా ఎలా నిర్వహించాలి? అనే దానిపై సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదిక ప్రకారం, ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.12.31 లక్షలు, అందులో సొంత జేబు నుంచి రూ.1.23 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
మిగిలిన మొత్తాన్ని టర్మ్ లోన్, వర్కింగ్ క్యాపిటల్‌గా బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. ప్లాంట్, మెషినరీని ఇన్‌స్టాల్ చేయడానికి, ముడి పదార్థాలు, పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి 1200–1800 చదరపు అడుగుల స్థలం కూడా అవసరం. సొంత భూమిని ఉపయోగించవచ్చు లేదా స్థలం లేకపోతే అద్దెకు తీసుకోవచ్చు.
* ప్రాజెక్ట్ ఖర్చు
భూమి సొంతం/అద్దెకు కొంత మనీ అవసరం. ప్లాంట్ & మెషినరీకి రూ. 8.10 లక్షలు, ఫర్నిచర్ & ఫిక్స్చర్స్‌కి రూ.0.50 లక్షలు, వర్కింగ్ క్యాపిటల్: రూ. 3.71 లక్షలు, మొత్తం రూ.12.31 లక్షలు.
* ఫైనాన్స్
సొంత జేబు నుంచి పెట్టుకోవాల్సిన మనీ రూ.1.23 లక్షలు, వర్కింగ్ క్యాపిటల్ (ఫైనాన్స్) రూ 3.34 లక్షలు, టర్మ్ లోన్ రూ. 7.74 లక్షలు, మొత్తం రూ. 12.31 లక్షలు.
* ప్రాఫిట్స్
ఈ వ్యాపారంలో ఏటా చాలా డబ్బు సంపాదించవచ్చు. నెలవారీ రుణ వాయిదాలను చెల్లించిన తర్వాత కూడా, మంచి లాభాల మార్జిన్ ఉంటుంది. ప్రొడక్ట్స్‌ను సమీపంలోని సూపర్ మార్కెట్‌లు, దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు విక్రయించవచ్చు. వివిధ రకాల, సైజుల స్క్రబ్బర్లను అందించడం ద్వారా మార్కెట్‌ను కూడా విస్తరించుకోవచ్చు.
KVIC నివేదిక ఈ వ్యాపారం లాభదాయకత ఐదు సంవత్సరాల ప్రొజెక్షన్‌ను కూడా ఇస్తుంది. రిపోర్ట్ ప్రకారం, మొదటి సంవత్సరంలో రూ.2.97 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ.3.77 లక్షలు, మూడవ సంవత్సరంలో రూ.4.47 లక్షలు, నాల్గవ సంవత్సరంలో రూ.5.50 లక్షలు, ఐదవ సంవత్సరంలో రూ. 6.37 లక్షల నికర లాభాన్ని ఆశించవచ్చు.
COMMENTS