Bank of Baroda: Bank of Baroda Special Offer for Students..Lots of Benefits with Job Bro Account
Bank of Baroda: విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ ఆఫర్.. బాబ్ బ్రో అకౌంట్‌తో బోలెడన్ని బెనిఫిట్స్
బ్యాంక్ ఆఫ్ బరోడా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లను అందించాలని నిర్ణయించింది. 16 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఈ బ్యాంకు ‘బాబ్ బ్రో’ సేవింగ్స్ అకౌంట్ (Bob BRO Savings Account) సేవలు ఆఫర్ చేస్తోంది.
విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ ఆఫర్..విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ ఆఫర్..
ప్రస్తుతం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అన్ని రకాల వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా వర్గాల అవసరాల ఆధారంగా ప్రత్యేక ఫైనాన్షియల్ ప్రొడక్టులను రూపొందిస్తున్నాయి. తాజాగా యువత ఆర్థిక అవసరాలను తీర్చడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లను అందించాలని నిర్ణయించింది. 16 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఈ బ్యాంకు ‘బాబ్ బ్రో’ సేవింగ్స్ అకౌంట్ (Bob BRO Savings Account) సేవలు ఆఫర్ చేస్తోంది. యువతకు నిరంతర బ్యాకింగ్ సేవలందించడమే ఈ స్కీమ్ లక్ష్యం.
ఇందులో భాగంగానే బ్యాంక్ ఆఫ్ బరోడా, స్పెషల్ బ్యాంకింగ్ పార్ట్‌నర్‌గా IIT బాంబే ప్రఖ్యాత యాన్యువల్ స్టూడెంట్ ఫెస్ట్ మూడ్ ఇండిగో (Moodi)తో కొలాబరేట్ అయింది. ఈ చర్యలు న్యూ జనరేషన్ అవసరాలకు అనుగుణంగా ఉండాలనే బ్యాంకు నిబద్ధతను చూపుతున్నాయి.
యువతకు బ్యాంకింగ్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి బాబ్ BRO సేవింగ్స్ అకౌంట్‌ను రూపొందించారు. ముఖ్యమైన ఫీచర్లు బ్యాంకింగ్‌ను సులభంగా, సూటిగా, విద్యార్థుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండేలా క్రియేట్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, రిటైల్ లయబిలిటీస్ & NRI బిజినెస్ చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ.. ఈ అకౌంట్ విద్యార్థుల నిర్దిష్ట బ్యాంకింగ్ అవసరాలను తీరుస్తుందని, వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫీచర్లు, ప్రయోజనాలను అందజేస్తుందని పేర్కొన్నారు.
యువతకు మరింత చేరువయ్యేందుకు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసియాలోని అతిపెద్ద కళాశాల సాంస్కృతిక ఉత్సవం మూడ్ ఇండిగోతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. కొత్త తరం కస్టమర్లకు చేరువ కావడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెటింగ్ & బ్రాండింగ్ హెడ్ V G సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ.. మూడ్ ఇండిగోతో భాగస్వామ్యం తరతరాలకు మించిన శాశ్వత సంబంధాలను నిర్మించే బ్యాంక్ పాలసీకి అనుగుణంగా ఉందని వివరించారు.
బాబ్ BRO సేవింగ్స్ అకౌంట్ ఫీచర్లు
బాబ్ BRO సేవింగ్స్ అకౌంట్‌కు మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. 16 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ బ్రాండ్‌లపై ఆఫర్లు అందించే కాంప్లిమెంటరీ డెబిట్ కార్డ్‌ను విద్యార్థులకు అందజేస్తారు. ప్రతి త్రైమాసికానికి రెండు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లు పొందవచ్చు.
అకౌంట్ హోల్డర్‌లకు రూ.2 లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుంది. అకౌంట్ యూటిలిటీ మ్యాక్సిమైజ్ చేయడానికి ఆటో స్వీప్ సౌకర్యం అందుబాటులో ఉంది. డిజిటల్ ఛానెల్స్, బ్రాంచెస్ ద్వారా ఉచిత NEFT/RTGS/IMPS/UPI ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. సీమ్‌లెస్ ట్రాన్సాక్షన్‌ల కోసం అన్‌లిమిటెడ్ ఫ్రీ చెక్ లీవ్స్‌కి యాక్సెస్ ఉంటుంది. అకౌంట్ యాక్టివిటీల గురించి తెలియజేయడానికి ఫ్రీ SMS/ఇమెయిల్ అలర్ట్స్ అందుకోవచ్చు.
బాబ్ BRO అకౌంట్ తీసుకున్న విద్యార్థులకు డీమ్యాట్ అకౌంట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలలో 100% వరకు రాయితీ ఉంటుంది. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో విద్యా రుణాలపై రాయితీ వడ్డీ రేట్లను పొందవచ్చు. అర్హతకు లోబడి, విద్యార్థులు ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్ ప్రయోజనాలు అందుకోవచ్చు.
COMMENTS