Apaar Id: Issuance of Apar cards in the country like Aadhaar.. this has many benefits! Who else is eligible..?
Apaar Id: ఆధార్ లాగే దేశంలో అపార్ కార్డుల జారీ.. దీంతో బోలెడన్ని బెనిఫిట్స్! మరి అర్హులెవరు..?
Students APAAR: ఆధార్ తరహాలో ఇప్పుడు అపార్ కార్డు మరో కార్డు కూడా జారీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ కార్డు ఎవరి కోసం? దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయా? అనేది ఇప్పుడు చూద్దాం.
దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు మస్ట్. ఇది అందరికీ చేరువయ్యింది కూడా. మరి అదే తరహాలో ఇప్పుడు అపార్ కార్డు మరో కార్డు కూడా జారీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కార్డు ఎవరి కోసం? దీని వల్ల ప్రయోజనాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
అపార్ కార్డు అనేది ప్రత్యేకంగా విద్యార్థులు కోసం రూపొందించబడింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యాబ్యాసం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ కార్డు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింద.
కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలోనే అపార్ కార్డు (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఇస్తున్నారు. వన్ నేషన్-వన్ ఐడీ అనే కాన్సెప్ట్ తో ఈ అపార్ కార్డుల జారీ జరగనుంది. ఈ (Automated Permanent Academic Account Registry - APAAR) జారీ కోసమై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఈ అపార్ కార్డులను ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అందించారు కూడా. అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ ఈ అపార్ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.
అపార్ కార్డుపై 17 అంకెల యూనిక్ నెంబర్ తో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇందులో విద్యార్థికి సంబంధించిన సంక్షిప్త సమాచారం ఉంటుంది. ప్రతి విద్యార్థి యొక్క పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ కార్డ్ లో సేవ్ చేసి ఉంచుతారు. ఈ కార్డులో విద్యార్థి విద్యకు సంబంధించిన పూర్తి డాటా ఉంటుంది. విద్యా నాణ్యతతో పాటు క్రీడా నైపుణ్యాల గురించి కూడా సేవ్ చేసి ఉంచుతారు.
విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే క్రమంలో అపార్ కార్డు ఉపయోగపడుతుంది. వివిధ పాఠశాలల్లో అడ్మిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు ఈ కార్డుతోనే అన్ని పనులు జరుగుతాయి.
ఈ ఆపార్ కార్డ్ బాధ్యతను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు సెంట్రల్ గవర్నమెంట్ అప్పగించింది. ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే దీనికి ఛైర్మన్‌గా ఉండనున్నారు. అపార్ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియనున్నాయి.
COMMENTS