AME CEE: AME Common Entrance Exam 2024, Important Dates
AME CEE: ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024, ముఖ్యమైన తేదీలివే
AME Common Entrance Exam: ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 ద్వారా విమానయాన రంగంలో లైసెన్స్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులు వంటి ఏవియేషన్ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు
AME Common Entrance Exam 2024– వైమానిక కోర్సుల్లో ప్రవేశాలకు ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా విమానయాన రంగంలో లైసెన్స్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా మరియు సర్టిఫికేషన్ కోర్సులు వంటి అనేక ఏవియేషన్ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సును అనుసరించి సంబంధిత గ్రూపులో 10వ తరగతి &12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. AIR (ఆల్ ఇండియా ర్యాంక్) ప్రకారం అర్హత పొందిన విద్యార్థులందరికీ 100% స్కాలర్‌షిప్‌ను కూడా అందిస్తంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
లైసెన్స్ ప్రోగ్రామ్: పైలట్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)), ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ)).
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ & మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతికి హాజరైన లేదా ఉత్తీర్ణత సాధించిన లేదా 3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
ఇంజినీరింగ్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ & మ్యాథమెటిక్స్ లేదా బయాలజీతో 12వ తరగతికి హాజరైన లేదా ఉత్తీర్ణత సాధించిన లేదా 3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్: బీబీఏ(ఏవియేషన్), బీఎస్సీ(ఏఎంఈ)
అర్హత: ఏదైనా స్ట్రీమ్‌లో 12వ తరగతికి హాజరైన లేదా ఉత్తీర్ణత ఉండాలి.
సర్టిఫికేట్ ప్రోగ్రామ్: క్యాబిన్ క్రూ, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా ప్రస్తుతం 10వ తరగతి పరీక్షకు హాజరవుతూ ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 14-28 సంవత్సరాల మధ్య కాలంలో ఒక్కో అభ్యర్థి 3 సార్లు AME CET పరీక్షను రాయవచ్చు. అడ్మిషన్ సమయంలో, ఏవియేషన్ సెక్టార్‌లో అభ్యర్థులు తమ కెరీర్‌ను కొనసాగించడానికి తప్పనిసరిగా 14-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష ఫీజు: జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1,200. మహిళలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం 75 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మొత్తం 300 మార్కులకు జరిగే పరీక్షలో ప్రతి ప్రశ్న 4 మార్కులను కలిగి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024.
➥ అడ్మిట్ కార్డుల జారీ: ఏప్రిల్ 2024 చివరి వారం.
➥ ప్రవేశ పరీక్ష తేదీ: మే 2024 మొదటి వారం.
➥ ఫలితాల వెల్లడి: మే 2024రెండో వారం.
➥ అడ్మిషన్ కౌన్సెలింగ్: మే 2024మూడో వారం.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR EXAM PATTERN CLICKHERE
FOR SCHOLARSHIP CLICKHERE
FOR WEBSITE CLICKHERE
.................................................
🔥 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram Channel ->https://bit.ly/3S6XNo4
COMMENTS