Alert for those who shop online..Government has banned it
ఆన్లైన్ లో షాపింగ్ చేసేవాళ్లకి అలర్ట్..దాన్ని బ్యాన్ చేసిన ప్రభుత్వం
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ‘డార్క్ ప్యాటర్న్స్’ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది.
Dark Patterns Ban: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ‘డార్క్ ప్యాటర్న్స్(Dark Patterns Ban)’ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. కంపెనీలు లేదా వ్యాపారవేత్తలు కస్టమర్లను మోసగించడానికి లేదా ‘డార్క్ ప్యాటర్న్స్’ ద్వారా వారి ఛాయిస్ లేదా ఆప్షన్స్ ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. కస్టమర్లను తప్పుదారి పట్టించేందుకు డార్క్ ప్యాటర్న్‌ల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నవంబర్ 30న ‘డార్క్ ప్యాటర్న్స్ నివారణ ,నియంత్రణ కోసం మార్గదర్శకాల గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ భారతదేశంలో వస్తువులు మరియు సేవలను అందించే అన్ని ప్లాట్‌ఫారమ్‌లు, ప్రకటనదారులు మరియు విక్రేతలకు కూడా వర్తిస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం జరిమానా విధించబడుతుంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, డార్క్ ప్యాటర్న్స్ ఆశ్రయించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది తప్పుదారి పట్టించే ప్రకటనలు లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా పరిగణించబడుతుంది. అలా చేసినందుకు, వినియోగదారుల రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం జరిమానా విధించబడుతుంది.
వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పిటిఐతో మాట్లాడుతూ.. ఈ-కామర్స్ పెరుగుతున్న కొద్దీ, వినియోగదారుల కొనుగోలు ఆప్షన్స్ మరియు ప్రవర్తనను మార్చడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి ప్లాట్‌ఫారమ్‌లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయని అన్నారు.
డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి?
డార్క్ ప్యాటర్న్ అనేది కస్టమర్లను తప్పుదారి పట్టించే మార్గం. ఉదాహరణకు, మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా ప్రొడక్ట్ కోసం సెర్చ్ చేసినప్పుడు, దాని ధర ఒక విధంగా కనిపిస్తుంది, కానీ మీరు మీ అకౌంట్ నుంచి లాగిన్ అయిన వెంటనే, ధర భిన్నంగా ఉంటుంది.
COMMENTS