Narak Chaturdashi 2023
నరక చతుర్దశి రోజున యమధర్మ రాజుని ఎందుకు పూజిస్తారు.. యమ దీపం వెలిగించే శుభ సమయం ఎప్పుడంటే..
నరక చతుర్దశి రోజున ఇంటి ముఖద్వారం వద్ద దీపం వెలిగించాలనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన తర్వాత నూనె, వేడినీళ్లు కలిపి స్నానం చేశాడని చెబుతారు. నూనె రాసుకుని స్నానం చేసే ఆచారం ఆ రోజు నుంచే మొదలైంది. ఇలా చేయడం వల్ల నరకం నుండి విముక్తి లభించి స్వర్గం ప్రాపిస్తుందని నమ్మకం. యముడి దీవెనలు కూడా లభిస్తాయని మత విశ్వాసం..
హిందూ మతంలో దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ మాసంలోని చతుర్దశి రోజున నరక చతుర్దశి రోజుగా అంటే దీపావళికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. కాళీ చౌదాస్, నరక్ చౌదాస్, రూప్ చౌదాస్, చోటి దీపావళి అని కూడా పిలుస్తారు. నరక చతుర్దశి రోజున మరణ భయాన్ని అధిగమించడానికి, ఆరోగ్యం కోసం యమ ధర్మ రాజుని పూజిస్తారు. యమ దీపాన్ని వెలిగిస్తారు.
నరక చతుర్దశి ఉదయమే అభ్యంగన స్నానం చేస్తారు. ఈ రోజు సాయంత్రం యమ తర్పణం, దీపాలను దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఇది సనాతన ధర్మంలోని ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నరక చతుర్దశి జరుపుకోవడం వెనుక కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. ఈ రోజున దీపం వెలిగించడం వల్ల యమ ధర్మరాజు సంతోషిస్తాడని.. అకాల మృత్యు భయం నుండి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు.
నరక చతుర్దశి ప్రాముఖ్యత:
నరక చతుర్దశి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం చతుర్దశి రోజున వస్తుంది. హిందూ మతంలో నరక చతుర్దశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి యముడిని పూజించాలని నమ్మకం. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి యమరాజును పూజించిన ఏ భక్తుడైనా నరకానికి వెళ్లకుండా రక్షించబడి స్వర్గప్రాప్తి పొందుతారని చెబుతారు. అలాగే సాయంత్రం వేళ యమ పూజ చేయడం వల్ల అకాల మృత్యుభయం ఉండదు.
నరక చతుర్దశి రోజున ఇంటి ముఖద్వారం వద్ద దీపం వెలిగించాలనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన తర్వాత నూనె, వేడినీళ్లు కలిపి స్నానం చేశాడని చెబుతారు. నూనె రాసుకుని స్నానం చేసే ఆచారం ఆ రోజు నుంచే మొదలైంది. ఇలా చేయడం వల్ల నరకం నుండి విముక్తి లభించి స్వర్గం ప్రాపిస్తుందని నమ్మకం. యముడి దీవెనలు కూడా లభిస్తాయని మత విశ్వాసం.
యమ దీపం వెలిగించే శుభ సమయం:
ఈ రోజు సాయంత్రం యమ దీపాలను వెలిగించడానికి శుభ సమయం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు యమ దీపాలను వెలిగించడానికి అనుకూలమైన సమయం. యమ దీపాన్ని బియ్యంతో నిండిన ఈ పాత్రపై నాలుగు వైపులా దీపం వెలిగిస్తారు.
నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటారు?
నరక చతుర్దశి పండుగ నరకాసురుడు, శ్రీకృష్ణుడితో ముడిపడి ఉంటుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు నరకాసురుడు అనే రాక్షసుడు తన శక్తులను దుర్వినియోగం చేసి దేవతలు, మునులు, ఋషులతో పాటు పదహారు వేల మంది యువరాణులను చెరసాలలో బంధించాడని నమ్ముతారు. దీని తరువాత రాక్షసుడి దురాగతాల వల్ల ఇబ్బంది పడిన దేవతలు, యువరాణులు శ్రీకృష్ణుని సహాయాన్ని కోరారు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడు నరకాసురుడిని చంపాడు. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున నరకాసురుడి బారి నుంచి బయటపడిన ఆనందంతో దేవతలతో పాటు.. ప్రజలు, మునులు కూడా సంతోషంగా ఉన్నారని… నరకాసురుని సంహరించిన జ్ఞాపకార్థం నరక చతుర్దశి పండుగను జరుపుకున్నారని.. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. దీనిని ఛోటీ దీపావళి అని కూడా పిలుస్తారు.
నరక చతుర్దశి పురాణం:
సనాతన ధర్మంలో ప్రతి పండుగను జరుపుకోవడం వెనుక ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. అదేవిధంగా, నరక చతుర్దశి అనగా చోటీ దీపావళిని జరుపుకోవడం వెనుక ఒక పురాణ కథ ఉంది. గ్రంధాల ప్రకారం, నరక చతుర్దశి రోజు శ్రీ కృష్ణుడితో ముడిపడి ఉంది. శ్రీ కృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించాడు. నరకాసుర చెర నుంచి విడిపించిన 16 వేల వందల యువరాణులను శ్రీ కృష్ణ భగవానుడు వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి ఈ రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని www.apteachers9.com ధృవీకరించడం లేదు
COMMENTS