JNTUH Certificate Courses : Admissions in online certificate courses in JNTUH
JNTUH Certificate Courses : JNTUHలో ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు
JNTUH Certificate Courses : జవహర్‌లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ కూకట్ పల్లిలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ నవంబర్ 2023 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవటానికి డిసెంబర్ 15వ తేది తుదిగడువుగా నిర్ణయించారు.
కోర్సుల వివరాలు ;
సైబర్ సెక్యూరిటీ ;
ఈ కోర్సులో సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, ఈ-కామర్స్ అండ్ డిజిటల్ సెక్యూరిటీ, సైబర్ లాన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ వంటి సబ్జెక్టులను బోధిస్తారు.
డేటా సైన్సెన్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్ ;
ఈ కోర్సులో ప్రోగ్రామింగ్ యూజింగ్ పైథాన్, మెషిన్ లెర్నింగ్ వంటి సబ్జెక్టులను బోధిస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ;
ఈ కోర్సులో పైథాన్ ఫర్ డేటా సైన్సెన్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సబ్జెక్టులను బోధిస్తారు.
అర్హత:
డిప్లొమా/ యూజీ/ పీజీ ఉత్తీర్డులై ఉండాలి.
కోర్సు వ్యవధి:
6 మాసాలు
ఆన్ లైన్ కోర్సు సమయాలు : ఉదయం 6.30 గం. నుంచి 8.30 గం. వరకు.
ఎంపిక ప్రక్రియ :
ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సీటు కేటాయిస్తారు.
ఫీజు వివరాలు:
రిజిస్టేషన్ రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ రూ.1000, కోర్సు ఫీజు రూ.25000.గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ విధానంలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు వివరాలు ;
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.
ఫైన్ తో అన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2023.
పూర్తి విరాలకు వెబ్ సైట్ ; https://www.jntuh.ac.in/ పరిశీలించగలరు
COMMENTS