JNTU Anantapur Recruitment 2023
JNTU అనంతపురంలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ..
JNTU Anantapur Recruitment 2023 : అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTUA)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 189 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
పోస్టుల ఖాళీలు ;
ప్రొఫెసర్లు 7 ఖాళీలు
అసోసియేట్ ప్రొఫేసర్లు 23 ఖాళీలు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు 159 ఖాళీలు
అర్హతలు ;
ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్ డీ విద్యార్హతగా నిర్ణయించారు. ఎంపికైన వారికి పే స్కేలు రూ. 1,44,200 నుండి 2,18,200 చెల్లిస్తారు.
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణు లై ఉండాలి. ఎంపికైన వారికి పే స్కేలు రూ.1,33,400 నుండి 2,17,100 చెల్లిస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, బీఈ, బీటెక్, బీఎస్ అండ్ ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారికి పే స్కేలు రూ.57,700 నుండి 1,82,400 చెల్లిస్తారు.
దరఖాస్తు చేసే విధానం ;
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ ; https://recruitments.universities.ap.gov.in) పరిశీలించాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రింట్ అవుట్ లను అవసరమైన ఇతర పత్రాలను జతపరిచి రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు, కొరియర్ ద్వారా జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం, ఆంధ్రప్రదేశ్ 515002కు పంపాల్సి ఉంటుంది.
ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది నవంబర్ 20, 2023గా నిర్ణయించారు. ఆన్ లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీలను పంపేందుకు ఆఖరు తేది నవంబర్ 27, 2023గా నిర్ణయించారు.
COMMENTS