ITPO Recruitment 2023 : Filling ITPO Young Professional Posts.. Salary Rs. 60,000
ITPO Recruitment 2023 : ITPO యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ.. జీతం రూ. 60,000.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అదనపు అర్హతతో పాటు B.E / B.Tech (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/IT/కంప్యూటర్ సైన్స్)తో సహా అవసరమైన విద్యార్హతలను కలిగి ఉండాలి.
ITPO Recruitment 2023 : భారత ప్రభుత్వ వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రీమియర్ ట్రేడ్ ప్రమోషన్ ఏజెన్సీ అయిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. సంస్ధకు ఎంప్లామెంట్ న్యూస్ 04,-10 నవంబర్ 2023 తేదిలలో పూర్తిస్ధాయి వివరాలతో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు నవంబర్ 19, 2023లోపు, లేదంటే అంతకు ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అదనపు అర్హతతో పాటు B.E / B.Tech (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/IT/కంప్యూటర్ సైన్స్)తో సహా అవసరమైన విద్యార్హతలను కలిగి ఉండాలి.
ITPO యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 2023కు సంబంధించిన ఖాళీ వివరాలు ;
మొత్తం 20 పోస్టులు యంగ్ ప్రొఫెషనల్ ఖాళీలు ఉన్నాయి.
ITPO ఉద్యోగాలకు విద్యా అర్హత ;
అభ్యర్థులు B.E / B.Tech (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/IT/కంప్యూటర్ కలిగి ఉండాలి. సైన్స్) కనీసం 70% మార్కులతో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి సమానమైన గ్రేడ్ కలిగి ఉండాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్/MBA కనీసం 60% మార్కులతో లేదా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి సమానమైన గ్రేడ్ లేదా రెండేళ్లు ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/CPSE/అటానమస్ బాడీ/యూనివర్శిటీ/పరిశోధన సంస్థలో పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి ;
దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 32 సంవత్సరాలు వయసు ఉండాలి. వయోపరిమితిలో సడలింపు వివరాల కోసం నోటిఫికేషన్ లింక్ ను పరిశీలించగలరు.
నెలవారీ వేతనం ;
రూ. 60,000/ను నెల వారీ వేతనంగా చెల్లిస్తారు.
ITPO రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన పత్రాలతో నిర్ణీత ఫార్మాట్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 19 నవంబర్ 2023లోపు nsrawat@itpo.gov.in మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన అటాచ్‌మెంట్‌లతో పాటు , పూర్తిచేసిన దరఖాస్తు ఫారమ్ pdf ఫైల్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వివరాల కోసం వెబ్ సైట్ ; https://indiatradefair.com పరిశీలించగలరు.
COMMENTS