CBHFL Recruitment 2023 : Vacancies in Cent Bank Home Finance Limited (CBHFL)
CBHFL Recruitment 2023 :సెంట్ బ్యాంక్ హోం ఫైనాన్స్ లిమిటెడ్(CBHFL)లో ఉద్యోగ ఖాళీల భర్తీ
CBHFL Recruitment 2023 : సెంట్ బ్యాంక్ హోం ఫైనాన్స్ లిమిటెడ్(CBHFL)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 60 ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరాఖాస్తులు కోరుతున్నారు.
పోస్టుల సంఖ్య: 60. వీటిలో ఎస్సీ-12, ఎస్టీ్-12, ఓబీసీ-15, ఈడబ్ల్యూఎస్-03, యూర్(జనరల్)-18 కేటాయించారు.
ఆఫీసర్: 31 పోస్టులు
అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.
సీనియర్ ఆఫీసర్: 27 పోస్టులు
అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.
సీనియర్ ఆఫీసర్(హెచ్‌ఆర్): 01 పోస్టు
అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ(హెచ్‌ఆర్) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.
సీనియర్ ఆఫీసర్ (కంప్లైన్స్): 01 పోస్టు
అర్హత విషయానికి వస్తే కంపెనీ సెక్రటరీ(ఎగ్జిక్యూటివ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
జీతం:
ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.3.60 లక్షలు, సీనియర్ ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.4 లక్షలు చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలు:
బెంగళూరు, భోపాల్, ఢిల్లీ/ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబయి/నేవీ ముంబయి/థానే/ఎంఎంఆర్ రీజియన్, చెన్నై.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 11.12.2023.
ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.12.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి, 2024లో.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.cbhfl.com/ పరిశీలించగలరు.
COMMENTS