When the bike was serviced in the Honda Service centre , they gave 3 locks instead of two.. Hats off Honda.. Details.
Honda సర్వీస్ సెంటర్ లో బైక్ ని సర్వీస్ కి ఇస్తే రెండు తాళాలకు బదులు 3 తాళాలు ఇచ్చారు.. హ్యాట్సాఫ్ హోండా.. వివరాలు.
ఒంగోలు పెయోనీర్ హోండా సర్వీస్ సెంటర్ లో ఒక కస్టమర్ హోండా shine బండి ని ఫుల్ సర్వీస్ చేయమని అడిగాడు. అక్కడ సర్వీస్ చేసే వ్యక్తి సుమారుగా 15000/- అయ్యిద్ది అని చెప్పి extra ఏమైనా ఐతే ఫోన్ చేస్తాను అని చెప్పాడు. వచ్చిన కస్టమర్ సరే అని చెప్పి బైక్ కీ ని ఇచ్చాడు.. కానీ ఆ బైక్ కి 2కీ లు (ఇంజిన్ కీ, సీట్ కింద కీ )ఉన్నాయి..కస్టమర్ కి తెలియక ఇంజిన్ కీ మాత్రమే ఇచ్చాడట ..
అక్కడ సర్వీస్ చేసే వ్యక్తికి సీట్ కింద కీ రాకపోవడం చేత screwdriver తో ట్రై చేసాడు.. ఆ కీ కాస్త విరిగి ఇరుక్కుపోయింది.
మరుసటి రోజు కస్టమర్ వెళ్లి సర్వీస్ ఐపోయిందా అని అడగగా... కీ సెట్ చెడిపోయింది.. కొత్తది కొనుక్కోండి.. అని సర్వీస్ చేసే వ్యక్తి చెప్పాడట..
సర్వీస్ మేనేజర్ ని కస్టమర్ అడుగగా.. మీరు రెండో కీ ఇచ్చిపోవాలి కదా.. అని అన్నాడట.. ఐతే కస్టమర్ రెండో కీ అవసరం ఐనప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా... నేను వచ్చి ఇచ్చేవాడిని కదా... Extra charges ఐనప్పుడు phone చేస్తాము అన్నారు... మరి కీ కావాల్సివచ్చినపుడు ఫోన్ ఎందుకు చేయరు అని అన్నాడట.
ఫైనల్ గా మూడు keyలు (ఇంజిన్ కీ, పెట్రోల్ ట్యాంక్ కీ, సీట్ కింద కీ ) కస్టమర్ కి ఇచ్చి, ఆ బిల్ 350/- కూడా కస్టమర్ bill లో వేశారట.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. కస్టమర్ దగ్గర ఉన్న రెండు కీ లు honda(షోరూం)వి..వాళ్ళు ఇచ్చిన keys బయట చేపించినవి...
కొస మెరుపు::Honda సర్వీస్ సెంటర్ లో honda keys చెడకొట్టి బయట చేపించిన keys ఇచ్చి పంపారట.
**మిత్రులారా దీనిపై మీ కామెంట్ తెలియచేయగలరు.
COMMENTS