VMMC: 909 Paramedical Posts in VMMC Safdarjung Hospital with these Qualifications
VMMC: వీఎంఎంసీ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో 909 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి.
VMMC Para medical Recruitment: న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లు సంయుక్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసాయి. దీనిద్వారా మొత్తం 909 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
పారామెడికల్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 909
పోస్టులు: ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్, రేడియోగ్రాఫర్, ఎక్స్-రే అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, నర్సింగ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ఎక్స్-రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, టెక్నీషియన్, సీనియర్ కార్డియాక్ టెక్నీషియన్, జూనియర్ కార్డియాక్ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్, కేర్ టేకర్, చైర్-సైడ్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, జూనియర్ ఫొటోగ్రాఫర్, డ్రస్సర్, సైకాలజిస్ట్, లైబ్రరీ క్లర్క్, స్టాటిస్షియన్ కమ్మెడికల్ రికార్డ్ లైబ్రేరియన్, జూనియర్ రేడియోథెరపీటెక్నాలజిస్ట్ (గ్రేడ్ I).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: పోస్టుని అనుసరించి 18 - 30 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 25.10.2023.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరితేదీ: 26.10.2023.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: నవంబర్ మొదటి వారం, 2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
COMMENTS