UPI Now Pay later: No money in your bank account? Do you know how to do UPI?
UPI Now Pay later: మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బుల్లేవా? అయినా UPI చేయోచ్చు తెలుసా.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి!
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ UPI యాప్స్ యూజ్ చేస్తున్నారు. అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకుంటే యూపీఐ పేమెంట్స్ చేయడం అస్సలు కుదిరే పనే కాదు. కానీ, ఇక నుంచి బ్యాలెన్స్ లేకున్నా పర్లేదు. బై నౌ పే లేటర్ మాదిరిగా యూపీఐ నౌ పే లేటర్ ఫెసిలిటీని తీసుకొచ్చింది RBI. మరి అది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది.
What is UPI Now Pay later
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర దాదాపుగా ఈ UPI యాప్స్ ఉంటాయి. రోజు వారీ ఖర్చులకు చిన్న చిన్న పేమెంట్స్ చేయడంలో ఇవి కీ రోల్ ప్లే చేస్తున్నాయి. నార్మల్ గా యూపీఐ చెల్లింపులు చేయాలంటే కచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ ఉండాల్సిందే. అయితే ఇక నుంచి మీ బ్యాంక్ అకౌంట్ లో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా కూడా UPI యాప్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చని మీకు తెలుసా? అవునండీ ఇది నిజమే. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయోచ్చు. UPI Now Pay later సౌకర్యాన్ని తీసుకొచ్చింది ఆర్‌బీఐ. అయితే ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
UPI Now Pay later అనేది బ్యాంకులు ముందుగా మంజూరు చేసిన క్రెడిట్ లైన్ నుంచి డబ్బులు పేమెంట్స్ చేయవచ్చు. ఇప్పటి వరకూ డెబిట్ కార్డు ద్వారా బ్యాంకు అకౌంట్ ని యూపీఐ యూప్స్ కి లింక్ చేసి ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు వీలయ్యేది. దీని ప్రకారం ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ను కూడా యూపీఐకి జత చేసుకునే వీలు ఉంది. బ్యాంకులు ముందుగా మంజూరు చేసిన లోన్ సౌకర్యాన్ని ప్రీ – అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటారు. దీన్నే ప్రీ శాంక్షన్డ్ లోన్స్ అని పిలుస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లాంటిదే.
అయితే ఈ క్రెడిట్ లోన్ అందించడానికి బ్యాంకులు ముందుగా మీ అనుమతి తీసుకుంటాయి. బ్యాంక్స్ ఆమోదించిన తరువాత UPI ద్వారా ఆ డబ్బును ఖర్చు చేయోచ్చు. దానికి స్పెసిఫిక్ లిమిటేషన్ ఉంటుంది. అలాగే డ్యూ డేట్ లోపు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ లైన్ సర్వీసెస్ ను కొన్ని బ్యాంకులు ఫ్రీగా అందిస్తే.. మరికొన్ని వడ్డీ కలెక్ట్ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు చాలా బ్యాంక్స్ తమ యూజర్స్ కి క్రెడిట్ లైన్ సర్వీసెస్ ని అందుబాటులోకి తెచ్చాయి. క్రెడిట్ లిమిట్, క్రెడిట్ డ్యూరేషన్, ఇంట్రెస్ట్ రేట్ వంటివి బ్యాంకులని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి.
ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్‌కు రూ. 50 వేల క్రెడిట్ లిమిట్ అందిస్తోందని అనుకుందాం. సదరు కస్టమర్ క్రెడిట్ లైన్ నుండి 10 రోజులకి గానూ రూ.5 వేలు ఖర్చు చేశారని అనుకుందాం. అయితే తీసుకున్న ఆ డబ్బులకి బ్యాంకు నార్మల్ వడ్డీని కలెక్ట్ చేస్తుంది. తీసుకున్న రోజులకి వడ్డీ కౌంట్ చేసి ప్రీ అప్రూవ్డ్ అకౌంట్ నుంచి తీసుకుంటుంది. అలా తీసుకున్న మొత్తం, వడ్డీ మొత్తాన్ని నెల ఆఖరులోపు చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా రీజన్ తో సరైన టైం లోపు చెల్లించకపోతే సదరు బ్యాంక్ మీ సేవింగ్స్ అకౌంట్ నుండి డబ్బులు తీసేసుకుంటుందని గుర్తు పెట్టుకోండి.
COMMENTS