Trending: Young man's new invention.
Trending: యువకుడి కొత్త ఆవిష్కరణ.. ఇక రైతులకు ఆ బాధ తీరినట్లే..
సంకల్పం వుంటే చాలు ఎంతటి అద్భుతాలు అయినా సృష్టించవచ్చు అని నిరూపిస్తున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడు. తండ్రి ఓ సాధారణ సైకిల్ కొట్టు నడిపిస్తున్నాడు. భగత్ చిన్ననాటి నుండే తండ్రికి సహాయ పడుతూ చదువుకునే వాడు. భగత్ డిప్లొమా పూర్తి చేశాక ఓ కంపెనీ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేసుకుంటూ తన ఆలోచనలకు పదును పెట్టాడు. గత సంవత్సరంలో అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రికల్ బైక్ తయారు చేసి ఎన్నో ప్రశంశలు పొందిన భగత్ మరో కొత్త పరికరాల ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు.
కలుపు వ్యవసాయ సాధనం..
రైతుల కోసం ప్రత్యేకంగా భగత్ తయారు చేసిన కలుపు వ్యవసాయ సాధనం రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. కలుపు పట్టినపుడు, లేదా ఏదైనా పిచ్చి మొక్కలు తీసే సమయంలో మోకాళ్ళపై కూర్చుని చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో రైతులకు మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ వంటివి వస్తాయి. మోకాళ్ళకు రాళ్ళు గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు రైతులు ఈ పరికరాన్ని మోకాలికి పెట్టుకుని పొలంలో పని చేసినట్లైతే ఆ ఇబ్బందుల నుండి రైతులకు ఉపశమనం లభిస్తుంది అని భగత్ తెలిపాడు.
ఈ పరికరాన్ని తయారీకి ఉపయోగించిన వస్తువులు..
1) రెండు స్పాంజ్ 2) నాలడుగుల సర్కిల్ పైప్ఈ రెండు వస్తువులతో ఈ పరికరాన్ని తయారు చేశాడు.
రైతుల కోసం ఆటోమేటిక్ సౌండ్ మెషిన్..
రైతులు కష్టపడి పంట సాగు చేస్తే, ఆ పంటను రాత్రికి రాత్రి అడవి పందులు చోరబడి నాశనం చేస్తాయి. దీంతో రైతులు పండించిన పంట కాస్త చేతికి రాకుండా పోతుంది. ఇలా భగత్ కుటుంబంలో ఒకరు బాధపడటం చూసి దీనికి ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్ సౌండ్ మెషిన్ కు శ్రీకారం చుట్టాడు భగత్. ఈ మెషిన్ పొలంలో పెడితే చాలు చిన్నగా గాలి తాకినా భారీగా శబ్ధం చేస్తాయి. ఈ శబ్దానికి పొలంలోకి పందులు కానీ ఇతర జంతువులు కానీ బయటకి వెళ్తాయి. దీంతో రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ పరికరాన్ని కావాలనుకున్న వారు కేవలం 1000 రూపాయలకే పొందవచ్చు. కావాల్సిన వారు నెంబర్..8341904658 భగత్ సంప్రదించాలని కోరారు.
COMMENTS