There is a door-to-door flight, if you see their quality, you have to say Baapre.
అక్కడ ఇంటింటికీ ఓ విమానం.. వారి దర్జా చూస్తే ఔరా అనాల్సిందే..
ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ ఓ బైక్ ఉంది. కార్లు కూడా చాలావరకు విస్తరిస్తున్నాయి. కానీ చాలా మంది మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కడమనేది ఓ కల. ఎందుకంటే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అయితే ఇక్కడ ఓ ఊరి వాళ్లకు మాత్రం విమానం అంటే ఓ బైక్ మాదిరిగానే.. అక్కడ ప్రతి ఇంటికీ ఓ విమానం ఉంది.
సాధారణంగా ప్రతి ఇంట్లో ఓ బైక్ ఉన్నట్లే.. ఆ ఊళ్లో ప్రతి ఇంటికీ ఓ విమానం ఉంది. వారు బయటకు వెళ్లాలంటే విమానంలోనే వెళ్తారు. మధ్యతరగతి ప్రజలకు జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలనే కల ఉంటే.. వీరు మాత్రం ప్రతి రోజూ తమ ట్రావెలింగ్ కోసం విమానాన్నే వాడతారు. వారే స్వయంగా నడుపుతారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ అంటే..
అగ్ర రాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో కామెరాన్ ఎయిర్‌పార్క్(Cameron AirPark) అనే చిన్న ఊరు ఉంది. ఈ ఊళ్లో ప్రతి ఇంటికీ ఓ సొంత విమానం ఉంది. ఇది యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కువగా బాగా డబ్బున్న సెలబ్రిటీలు ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఇంటికీ ఓ చిన్న విమానం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ, ఇది నిజం ఈ గ్రామస్తులు చాలా కాలంగా విమానాలను కలిగి ఉన్నారు. ఇక్కడి ప్రజలు వ్యక్తిగత, వృత్తిరీత్యా, వ్యాపార ప్రయోజనాల కోసం విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌లను ఉపయోగిస్తున్నారని స్థానిక మీడియా నివేదించింది. అందుకే ఈ గ్రామాన్ని ఫ్లై-ఇన్ కమ్యూనిటీ అని కూడా పిలుస్తారు.
అయితే ఈ గ్రామంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. బయటి వారు సులభంగా ఈ గ్రామంలోకి ప్రవేశించలేరు. స్థానికుల అనుమతితో మాత్రమే ఆ గ్రామంలోకి రాగలరు. అంతే కాకుండా ప్రతి ఇంటి వద్ద విమానాలను పార్క్ చేయడానికి వ్యక్తిగత ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు మరియు ఎయిర్‌క్రాఫ్ట్ స్టాండ్‌లు ఉన్నాయి.
ఇక్కడ బైక్‌లు మరియు కార్లను పార్క్ చేసినట్లుగా విమానాలను వారి ఇళ్ల ఎదుట పార్క్ చేస్తారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. ఈ గ్రామంలో చాలా మందికి విమానాలు నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది. లైసెన్స్ లేకుండా విమానం నడపలేరు. ఇదిలా ఉండగా, ఈ గ్రామంలోని చాలా మంది రిటైర్డ్ మిలటరీ పైలట్లే కావడం విశేషం.
అందుకే వారు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సునాయాసంగా విమానాలను ఆపరేట్ చేయగలరు. కామెరాన్ ఎయిర్‌పార్క్ గ్రామంలో మొత్తం 124 ఇళ్లు ఉన్నాయని సమాచారం. ఈ ఊరు 1963లో స్థాపించబడిందని.. ఇక్కడ వీధి పేర్లు, రహదారి పేర్లతో పాటు కొన్ని ఇంటి పేర్లు కూడా విమానం పేరును సూచిస్తాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, అనేక ఎయిర్‌స్ట్రిప్‌లను బాగు చేయలేదు. సివిల్ ఏవియేషన్ అథారిటీ అటువంటి విమానాశ్రయాలను రిటైర్డ్ ఆర్మీ పైలట్‌ల కోసం రెసిడెన్షియల్ ఎయిర్ పార్క్‌లుగా మార్చే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇప్పటికీ ఈ పనులను నిర్వహిస్తోంది.
అందువల్ల, కాలిఫోర్నియాలోని ఈ కామెరాన్ ఎయిర్‌పార్క్ లాగా, ఫ్లోరిడాలో స్ప్రూస్ క్రీక్ అనే ఎయిర్‌పార్క్ ఉంది. ఈ గ్రామం కామెరూన్ ఎయిర్‌పార్క్‌ను పోలి ఉండటం గమనార్హం. ఈ పార్కులు ప్రైవేట్ జెట్‌ల నుంచి చారిత్రాత్మక విమానాల వరకు అనేక రకాల విమానాలకు నిలయంగా ఉన్నాయి. మొత్తం 650 విమానాలు ఉన్నాయని గణాంకాల ద్వారా వెల్లడైంది.
కాగా స్ప్రూస్ క్రీక్‌లో సుమారు 5 వేల మంది నివసిస్తున్నారు. అలాగే, 1,300 ఇళ్లు ఉన్నట్లు సమాచారం. ఇది కాకుండా 700 విమానాలను అక్కడ స్థానికులు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా, అమెరికాలో మొత్తం 426 రెసిడెన్షియల్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో గ్రామస్తులు విమానాలను సులభంగా నడపగలిగేలా రహదారిని చాలా వెడల్పుగా నిర్మించారు. వారు దీన్ని రన్‌వేగా ఉపయోగిస్తారు.
COMMENTS