Success Story: A woman who rose from a shop floor supervisor to a CEO with a monthly salary of Rs.10.9 crores
Success Story: నెల జీతం రూ.10.9 కోట్లు..షాప్ ఫ్లోర్ సూపర్వైజర్ నుంచి CEOగా ఎదిగిన మహిళ
Success Story: చాలా మంది సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, రెండు మూడు ప్రమోషన్లతో రిటైర్ అయిపోతుంటారు. అతి తక్కువ మందే పని చేస్తున్న రంగంలో టాప్ పొజిషన్‌కి చేరుకుంటారు. రేవతి అద్వైతి కూడా ఇదే కోవకు చెందుతారు. బిజినెస్ వరల్డ్‌లో ఆమె పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం ప్రఖ్యాత గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్లెక్స్ CEOగా పని చేస్తున్నారు. సాధారణ ఉద్యోగం నుంచి టాప్ సీఈఓగా ఎదిగిన ఆమె ప్రస్థానం అందరికీ ఆదర్శం.
ప్రారంభ జీవితం, విద్య ..
కార్పొరేట్ వరల్డ్‌లో రేవతి అద్వైతి ప్రయాణం పటిష్టమైన సాలిడ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌తో ప్రారంభమైంది. ఆమె ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటూ, ఆమె 2005లో థండర్బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి MBA అందుకుంది.
ఈటన్, హనీవెల్‌లో కెరీర్ ..
అద్వైతి షావ్నీ, ఓక్లహోమాలోని ఈటన్లో తన కెరీర్‌ని ప్రారంభించింది. అక్కడ ఆమె షాప్ ఫ్లోర్ సూపర్వైజర్గా సేవలు అందించింది. 2002లో ఆమె హనీవెల్‌లో చేరింది. వివిధ ప్రొడక్షన్, లాజిస్టిక్స్ పొజిషన్స్‌లో ఆరు సంవత్సరాలు పని చేశారు. ఈ ప్రఖ్యాత కంపెనీలలో అనుభవాలు ఆమెకు మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై మేనేజ్మెంట్ ఛైన్ మేనేజ్మెంట్లో లోతైన అవగాహనను కల్పించాయి.
ఈటన్లో COO పోస్ట్..
2008లో రేవతి అద్వైతి ఈటన్కి తిరిగి వచ్చారు, అక్కడ ఆమె ఒక దశాబ్దం పాటు ఎలక్ట్రికల్ బిజినెస్ యూనిట్‌లోని అనేక విభాగాల నిర్వహణకు సహకరించారు. ఆమె అచంచలమైన అంకితభావం, నైపుణ్యం ఆమెకు ఈటన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా అవకాశాన్ని తీసుకొచ్చాయి. ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన మైలరాయిని అందుకుంది. క్లిష్టమైన కార్యకలాపాలకు నాయకత్వం వహించే, నిర్వహించే అవకాశాన్ని పొందింది.
ఫ్లెక్స్‌లో సీఈవో..
2019 ఫిబ్రవరిలో అద్వైతి గ్లోబల్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్లెక్స్‌లో CEOగా చేరారు. ఆమె నాయకత్వంలో, ఫ్లెక్స్ ఎండ్-టు-ఎండ్ క్లయింట్ వాల్యూ చైన్ ఓనర్షిప్ వైపు దృష్టి సారించింది. ఆమె మేనేజ్మెంట్ అప్రోచ్‌ని ఎంపతీ, షిఫ్ట్ యాక్షన్‌గా వర్గీకరించారు. అద్వైతి డైవర్సిటీ, ఇన్‌క్లూజివిటీ, కార్పొరేట్ స్ట్రాటజీలో సస్టైనబిలిటీకి ప్రసిద్ధి చెందింది.
కుటుంబం, నేపథ్యం..
రేవతి అద్వైతిపై విభిన్న సంస్కృతుల ప్రభావం ఉంది. ఆమె తల్లి విశాలం స్వామి గృహిణి. ఆమె తండ్రి A.N.N. స్వామి, కెమికల్ ఇంజనీర్. చెన్నైలో స్థిరపడకముందు, ఆమె కుటుంబం బీహార్ , గుజరాత్ , అస్సాం సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించింది.
నెట్ వర్త్, శాలరీ..
2022 ఫ్లెక్స్ వార్షిక నివేదిక ప్రకారం.. రేవతి అద్వైతి మొత్తం 15,979,041 డాలర్ల యాన్యువల్ శాలరీ అందుకుంటోంది. భారతీయ కరెన్సీలో రూ.131 కోట్లకు పైగా ఉంటుంది. అంటే నెలకు అద్వైతి దాదాపు రూ.10.9 కోట్లు సంపాదిస్తోంది. మీడియా అంచనాల ప్రకారం ఆమె నెట్ వర్త్ దాదాపు రూ.295 కోట్ల నుంచి రూ.445 కోట్లు మధ్య ఉంటుంది.
COMMENTS