Success Story: A business started with a loan of Rs.10 thousand.. The current value is Rs.14,000 crores..
Success Story: రూ.10 వేల రుణంతో మెుదలైన బిజినెస్.. ప్రస్తుతం విలువ రూ.14,000 కోట్లు..
Success Story: వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి దేశంలో అగ్రగామి వ్యాపారాలను సృష్టించారు అనేక మంది. చిన్న రుణం తీసుకున్నప్పటి నుంచి తాము నమ్మిన కలను నిజం చేసుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడిన విజయగాథలు ప్రస్తుతం చాలా మందికి స్పూర్తి దాయంకంగా నిలుస్తున్నాయి.
రాజేష్ మెహతా గుజరాత్‌కు చెందిన వ్యక్తి. కానీ చదువుకున్న మాత్రం బెంగళూరులో. ఆయన తండ్రి జస్వంతరి మెహతా ఆభరణాల వ్యాపారం కోసం కర్ణాటకకు వచ్చారు. అలా 16 ఏళ్ల వయస్సులో కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అన్న, తండ్రితో కలిగి పనిచేయటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాజేష్ మెహతా ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలనుకున్నాడు. అదే లక్ష్యంతో తన సోదరుడి వద్ద రూ.2వేలు అప్పు చేయగా.. బ్యాంకు నుంచి రూ.8వేలు రుణాన్ని తీసుకున్నాడు.
అలా 1982లో అప్పుగా తీసుకున్న డబ్బుతో తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఒకప్పుడు షాపులకు వెళ్లి బంగారు ఆభరణాలను విక్రయించేవాడు. కానీ ఇప్పుడు దేశంలో ప్రముఖ బంగారు ఎగుమతిదారుగా మారాడు. ప్రస్తుతం ఆయన ప్రారంభించిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వ్యాపార సామ్రాజ్యం విలువ రూ.13,800 కోట్లుగా ఉంది. చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నప్పటికీ విజయవంతమైన వ్యాపారిగా కాలం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం మెహతా సంస్థ బంగారు ఆభరణాలు, పతకాలు, నాణేలతో సహా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తోంది.
ఏడాదికి 400 టన్నుల బంగారు ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యాన్ని రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ కలిగి ఉంది. మొదట్లో రాజేష్ మెహతా చెన్నై నుంచి ఆభరణాలు కొనుగోలు చేసి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విక్రయించేవాడు. తాను చేస్తున్న పనితో మంచి ఆదాయం రావటంతో దానిని పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. అలా గుజరాత్‌లోని రిటైల్ వ్యాపారులకు ఆభరణాలను విక్రయించడం ప్రారంభించాడు. అలా తన వ్యాపారాన్ని బెంగళూరు, చెన్నై, హైదరాబాదుకు విస్తరించాడు. 1989లో బంగారు ఆభరణాల వ్యాపారంలోకి ప్రవేశించి, బెంగళూరులోని తన చిన్న గ్యారేజీలో బంగారు ఆభరణాల తయారీ యూనిట్‌ను ప్రారంభించాడు. ఇక్కడే అతని జీవితం మలుపుతిరిగింది. ప్రస్తుతం ఈ యూనిట్‌లో మెహతా బంగారు వస్తువులను తయారు చేసి బ్రిటన్, దుబాయ్, ఒమన్, కువైట్, అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు.
COMMENTS