Rashi Bagga: A package beyond IIT,IIM students...a young woman with a job offer of Rs 85 lakh is a record
Rashi Bagga: IIT,IIM స్టూడెంట్స్‌కు మించిన ప్యాకేజీ..రూ.85 లక్షల జాబ్ ఆఫర్‌తో యువతి రికార్డు.
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్‌పూర్ (IIIT-NR), BTech విద్యార్థి రాశి బగ్గా ఒక రికార్డు సృష్టించింది. రూ.85 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను దక్కించుకుని, మునుపటి రికార్డులను బద్ధలు కొట్టింది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం సంపాదించడం సవాలుగా మారింది. స్కిల్స్ లేకపోవడం ఓ కారణమైతే, రిక్రూట్‌మెంట్ తగ్గడం మరో కారణం. అయితే ప్రతిభ ఉన్న వారికి అవకాశాలకు కొదవ లేదు. అవసరమైన నైపుణ్యాలు ఉంటే.. కాలేజీ నుంచి భారీ జీతంతో నేరుగా టాప్ కంపెనీలో అడుగు పెట్టవచ్చు. చాలా మంది విద్యార్థులు టాప్ కంపెనీల్లో రికార్డు స్థాయి ప్యాకేజీలతో కొలువులు సంపాదించారు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్‌పూర్ (IIIT-NR), BTech విద్యార్థి రాశి బగ్గా ఇదే కోవకు చెందుతుంది.
ఈ ఏడాది ప్రారంభంలో రాశి బగ్గా రూ.85 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను దక్కించుకుని, మునుపటి రికార్డులను బద్ధలు కొట్టింది. 2023వ సంవత్సరంలో IIIT-NR నుంచి అత్యధిక ప్యాకేజీ పొందిన విద్యార్థిగా ఆమె నిలిచింది.
అక్కడితో ఆగిపోలేదు!
రాశి బగ్గా స్టోరీని స్ఫూర్తిదాయకంగా మార్చేది ఆమె సంకల్పం, తిరుగులేని అన్వేషణ. భారీ ప్యాకేజీని అందుకోక ముందే, ఆమెకు మరో కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. అయితే ఆమె అక్కడితో విశ్రమించలేదు. జాబ్ మార్కెట్‌లో తన సత్తాను నిరూపించుకునేందుకు ఇంటర్వ్యూలకు హాజరవుతూనే వచ్చింది. చివరికి ఈ రికార్డు బద్దలు కొట్టే ఆఫర్‌ను అందుకోవడంలో విజయం సాధించిందని ఐఐఐటీ మీడియా కోఆర్డినేటర్ తెలిపారు. ఈ అద్భుతమైన విజయానికి ముందు బగ్గా బెంగళూరులోని ఇంట్యూట్‌లో SDE ఇంటర్న్‌గా, అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంటర్న్‌గా పనిచేశారు. 2023 జులై నుంచి ఆమె అట్లాసియన్‌కి ప్రొడక్ట్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.
IIIT-NR సక్సెస్ స్టోరీలు
అంతకు ముందు IIIT-NRలో భారీ ప్యాకేజీ రికార్డు విద్యార్థి చింకీ కర్ణా పేరిట ఉంది. అతను గత సంవత్సరం ఇదే కంపెనీ నుంచి సంవత్సరానికి రూ.57 లక్షల ప్యాకేజీని రికార్డు నెలకొల్పాడు. మరో విద్యార్థి, యోగేష్ కుమార్, ఒక మల్టినేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రోల్‌కి సంవత్సరానికి రూ.56 లక్షల ప్యాకేజీ పొందాడు. 2020లో మరో IIIT-NR విద్యార్థి రవి కుశాశ్వ ఒక పెద్ద మల్టినేషన్ కంపెనీ నుంచి సంవత్సరానికి రూ.1 కోటి యాన్యువల్ ప్యాకేజీతో ఆఫర్ అందుకున్నాడు.
IIIT-NR ప్లేస్‌మెంట్ విజయం
ప్లేస్‌మెంట్స్ పరంగా IIIT-NR ట్రాక్ రికార్డ్ విస్తరిస్తోంది. వరుసగా ఐదో సంవత్సరం ఈ ఇన్‌స్టిట్యూట్ 100 శాతం ప్లేస్‌మెంట్ రేట్‌ను సాధించింది. ఐదేళ్లుగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అందరికీ IIIT-NR ఉద్యోగ అవకాశాలు అందించింది, 100 శాతం ప్లేస్‌మెంట్స్ పొందింది. రాశి బగ్గా ప్లేస్‌మెంట్ కారణంగా, ఈ సంవత్సరం బ్యాచ్‌కి సగటు వార్షిక వేతనం రూ.16.5 లక్షలకు పెరిగింది.
COMMENTS