PM Mudra Loan: Thinking of starting a small business? Rs. Loan up to 10 lakhs.. very easy.. without any charges..
PM Mudra Loan: చిన్న వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారా? రూ. 10లక్షల వరకూ లోన్.. చాలా ఈజీగా.. ఎటువంటి చార్జీలు లేకుండానే..
మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? దాని కోసం పెట్టుబడికి నిధులు లేక ఆగిపోతున్నారా? బ్యాంకుల దగ్గరకు వెళ్తే ఏదైనా పత్రం తెమ్మని లేదా గవర్నమెంట్ ఉద్యోగి ష్యూరిటీ కావాలని అడుగుతున్నారా? అలాంటివి ఏమి లేక ముందుకు వెళ్లలేకపోతున్నారా? అయితే మీకోసమే ఈ కథనం. మీ లాంటి వారి కోసమే భారత కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిలో చిన్న వ్యాపారాలు ప్రారభించుకునేందుకు తక్కువ వడ్డీతో రుణాలిస్తుంది. అది కూడా ఎటువంటి ష్యూరిటీలు, ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం పేరు ప్రధాన మంత్రి ముద్ర యోజన. దరఖాస్తు చేస్తున్న వారికి రూ. 50,000 నుంచి రూ. 10లక్షల వరకూ రుణ సదుపాయం చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇది ముద్రా లోన్..
కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక రకాల పథకాలను రూపొందిస్తూనే ఉంది. అందులో ఒకటి ప్రధాన మంత్రి ముద్రా యోజన. ఈ పథకం ద్వారా మీరు ఎలాంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ఈ లోన్‌లో మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా, ఈ వ్యక్తులు సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీలు), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మరియు ఎన్బీఎఫ్సీల నుంచి కూడా ఈ రుణాన్ని పొందవచ్చు. అయితే ఈ రుణంపై వడ్డీ రేటు బ్యాంకులను బట్టి మారుతుంటుంది. సాధారణంగా బ్యాంకులు ఈ రుణంపై 10 నుంచి 12 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తాయి.
ముద్రా రుణాలు మూడు రకాలు..
పీఎం ముద్రా రుణాలు మొత్తం మూడు రకాలుగా ఉన్నాయి.
- మొదటి వర్గం శిశు రుణం. దీని కింద, మీరు మొదటిసారిగా మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, ప్రభుత్వం మీకు ఎటువంటి హామీ లేకుండా 5 సంవత్సరాలకు రూ. 50,000 వరకు రుణాన్ని ఇస్తుంది. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి రుణాలు కూడా ఇస్తారు.
- మీరు రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు రుణం తీసుకుంటే, అది కిషోర్ లోన్ కేటగిరీ కిందకు వస్తుంది.
- తరుణ్ లోన్ కేటగిరీ కింద, వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది.
ముద్రా లోన్ దరఖాస్తు ఇలా..
ఈ పథకంలో, 24 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ తో పాటు ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, అడ్రస్ ప్రూఫ్ మొదలైనవి అవసరం అవుతాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి, mudra.org.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఆపై ఫారమ్‌లో మొత్తం నింపి.. మీ సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్‌కు సమర్పించాలి అన్ని డాక్యుమెంట్‌లను పరిశీలించిన తర్వాత బ్యాంక్ మీ లోన్‌ను అప్రూవ్ చేస్తుంది.
COMMENTS